YuvaRaj Singh: ఈనెల 16 నుంచి టి20 వరల్డ్ కప్ సమరం మొదలుకానుంది. సిక్సర్ల మోత షురూ కానుంది.
ఆస్ట్రేలియా నుంచి వార్నర్, ఇండియా నుండి రోహిత్ శర్మ సిక్సర్ల మోత మోగించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు అన్ని టి20 వరల్డ్ కప్ కలిపి యువరాజు 33 సిక్సర్లతో ఇద్దరి కంటే ముందు వరసలో ఉన్నాడు. యువరాజ్ సింగ్ తర్వాత రోహిత్ శర్మ, వార్నర్ ఉన్నారు. అయితే తాజాగా ఇటువంటి వరల్డ్ కప్ ఆడబోతున్న ఇద్దరు యువరాజ్ సింగ్ రికార్డుపై కన్నేశారు.
T20 వరల్డ్ కప్-2007 నుండి వరుసగా టి20 వరల్డ్ కప్ అయినా తనదైన ప్రదర్శనను చేస్తూ ఉన్నాడు. ఎనిమిదో సారి T20 వరల్డ్ కప్ లో పాల్గొనబోతున్నాడు. 33 T20 మ్యాచుల్లో 31 సిక్సర్లతో కొనసాగుతున్నాడు. తాజాగా ఫుల్ టైం కెప్టెన్ గా పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్లో ఆడే అవకాశాలు ఉన్నాయి. దీంతో యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 33 సిక్సర్ల రికార్డు బద్దలవడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.
అయితే రోహిత్ శర్మతో పాటు ఈ టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా నుంచి వార్నర్ కూడా పాల్గొంటున్నాడు. టి20 వరల్డ్ కప్ లో అన్ని 30 మ్యాచుల్లో కలిపి 31 సిక్సర్లతో కొనసాగుతున్నాడు. ఈవెంట్లో డేవిడ్ వార్న డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాకు కీలక ఆటగాడిగా మారడంతో దాదాపు యువరాజ్ సింగ్ రికార్డు బద్దలవ్వడం ఖాయంగా అనిపిస్తుంది. వీరి తర్వాత ఇంగ్లాండ్ నుంచి జోస్ బట్లర్ 26 సిక్సర్లతో కొనసాగుతున్నాడు.
YuvaRaj Singh:
అయితే వీరి కంటే ముందుగా గేల్ ఎవరికి అందనంత ఎత్తులో కొనసాగుతున్నాడు. 33 మ్యాచుల్లో 63 సిక్సర్లతో ఉన్నాడు. అయితే కెప్టెన్ గా అత్యధిక స్కోరు సాధించిన క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం రోహిత్ శర్మకు ఉంది. దీంతో ఈ T20 ప్రపంచ కప్ లో ఎన్నో రికార్డులు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు