YS Sharmila’ : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి వైఎస్ షర్మిల గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే జగ్గారెడ్డి అట, ఆయన ఇప్పుడు ఏపార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. మొదట టీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీలో ఉన్న ఆయన.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని షర్మిల చెప్పారు. రోజుకో పార్టీ మారితే ఎలా జగ్గారెడ్డి అని షర్మిల ప్రశ్నించారు. తాను బీజేపీ వదిలిన బాణం అంటూ ఈ జగ్గయ్య అంటున్నారని, అయ్యా జగ్గయ్య తాను బీజేపీ వదిలిన బాణం కాదు అంటూ షర్మిల సెటైర్ వేశారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని, వైఎస్సార్ వదిలిన బాణం అంటూ షర్మిల కామెంట్ చేశారు.
ఇటీవల వైఎస్ షర్మిలపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల బీజేపీ వదిలిన బాణమంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల సీరియస్ అయ్యారు. గతంలో తాను కేసీఆర్ వదిలిన బాణమంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడేమో బీజేపీ వదిలిన బాణమంటూ మాట్లాడుతున్నారని అన్నారు. రోజుకో మాట మాట్లాలడుతుున్నారరని, తాను టీఆర్ఎస్, బీజేపీ ఇద్దరికీ వ్యతిరేకమేనని షర్మిల తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కేంద్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపైనే తన పోరాటం అని షర్మిల స్పష్టం చేశారు.
టీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ప్రజల సమస్యలపై పోరాడుతానని తెలిపారు. కేసీఆర్ గత ఎనిమిదేళ్లుగా గారడీ మాటలు చెబుతున్నారని, రంగులో మార్చడంలో ఆయన దిట్ట అని ఆరోపించారు. రంగులు మార్చడంలోకేసీఆర్ మోనగాడంటూ విమర్శించారు. ఉద్యోగాలు లేక వందలమంది నిరుద్యోగులు చనిపోతే ఒక్క రూపాయి కూడా ఆర్ధిక సాయం చేయలేదని షర్మిల విమర్శించారు. పథకాలు పేరు చెప్పి అమలు చేయకుండా మోసం చేస్తున్నారని, ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ ఉంటారని అనఅ్నారు.
YS Sharmila’ :
తెలంగాణలో ప్రజలను కేసీఆర్ తో పాటు కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ కూడా మోసం చేశాయని షర్మిల ఆరోపించారు.