ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 7వ తేదీన సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 5వ తేదీమధ్యాహ్నం 2 గం. లోగా సాధారణ పరిపాలన శాఖకు క్యాబినెట్ క్లియరెన్స్ ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తికావడంతో వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో కేబినెట్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై 40 నిమిషాలకు పైగా చర్చలు జరిపారు.
