యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రియ షార్ట్ ఫిల్మ్స్,వెబ్ సిరీస్ లతో యువతను బాగా ఆకట్టుకుంది.ఆరోగ్య పరంగా తను అవరోధాలు ఎదుర్కొంటునప్పటికి వాటిని దాటుకుని తనకిష్టమైన యాక్టింగ్ చేస్తూ ఆడియన్స్ మన్ననలు పొందుతూ యంగ్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ గా,యూట్యూబర్ మారింది.అలాంటి శ్రియ నిన్న రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందింది.
27 సంవత్సరాలకే శ్రియా మురళీధర్ మృతి చెందడంతో ఆమె సన్నిహితులు కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.శ్రియా మురళీధర్ మృతి పట్ల బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ దీప్తీ సునయన,నటి సురేఖ వాణి కుమార్తె సుప్రియ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ చెర్రీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు