వైసీపీ అధినేత జగన్ మొదటి నుంచి కులాల మధ్య విభజన తీసుకొచ్చి వారికి ఏవో చిన్న చిన్న ఆశలు చూపించి తద్వారా తన రాజకీయ భవిష్యత్తుని సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికలలో అలాంటి హామీలతోనే కాపులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటుబ్యాంకుతో భారీ మెజారిటీ సొంతం చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కులానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి బీసీ వైసీపీలో ఉన్న ఆ కులానికి చెందిన వారికి చైర్మన్ గా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అయితే కులాల ప్రాతిపాదిగాగా కమిషన్ లు అయితే ఏర్పాటు చేశారు కాని ఆ కులాల్లో ఉన్న యువత స్వయం ఉపాధి కోసం నిధులు మాత్రం ఇవ్వలేదు. ఇక ఎస్సీ, ఎస్సీ, బీసీ సబ్ ప్లాన్ నిధులని కూడా సంక్షేమ పథకాల కోసం వాడేసుకున్నారు. అలాగే ఉద్యోగులు దాచుకునే ఫండ్స్ ని కూడా ప్రభుత్వ అవకాశాల కోసం జగన్ వాడేసుకున్నారు.
అయితే అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం అంటూ బయటకి మాత్రం వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈ కులాల విభజన వెనుక అంతర్యం ఏమిటనేది అందరికి తెలుసు. అయితే ఇప్పుడు ఏపీలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులలో సరైన యూనిటీ లేకపోవడం వలన, బలమైన నాయకుడు నిలబడకపోవడం వలన రాజ్యాధికారాన్ని పొందలేకపోయారు. కొంతమంది కాపులు నాయకులుగా ఉన్న వారు చంద్రబాబు, లేదంటే వైఎస్ కుటుంబానికి విధేయులుగా ఉంటూ తమ స్వామీ భక్తిని చూపించుకుంటున్నారు. ఇదిలా ఉంటే జనసేన పవన్ కళ్యాణ్ రూపంలో ఇప్పుడు కాపులు రాజ్యాధికారం పొందడానికి ఒక నాయకుడు కనిపిస్తున్నాడు. ఈ నేపధ్యంలో కాపులు అందరిని యునైట్ చేయాలని కొంత మంది చూస్తున్నారు.
అయితే దీనిపై జగన్ తన విధేయులు అయిన కాపు ఎమ్మెల్యేలు, మంత్రులని రంగంలోకి దించి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అది వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు కాపునాడు వేదికగా కాపులు అందరూ ఏకమై పవన్ కళ్యాణ్ ని తమ కులం నుంచి సీఎం అభ్యర్ధిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో ఉన్నపళంగా వైఎస్ కుటుంబం విధేయుడుగా ఉంటూ గత ఎన్నికల సమయంలో కాపుల రిజర్వేషన్ ఉద్యమం పేరుతో టీడీపీ ఓటమిని సాశించిన ముద్రగడని రంగంలోకి దించినట్లు తెలుస్తుంది.
వంగవీటి రంగా వర్ధంతికి ముందురోజే ముద్రగడ తెరపైకి వచ్చి కాపులకి రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ జగన్ కి లేఖ రాసారు. కాపులు అందరూ గత ఎన్నికలలో మీకు మద్దతు ఇచ్చి గెలిపించారని, మరోసారి అలాంటి అవకాశం ఈ రిజర్వేషన్ తో పొందాలని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ఇక ముద్రగడ లేఖని అడ్డుపెట్టుకొని కాపులకి రిజర్వేషన్ అంశం పరిశీలిస్తామని చెప్పడం లేదంటే ప్రకటించడం ద్వారా జగన్ మళ్ళీ కాపులలో విచ్చిన్నం తీసుకొచ్చి తనకి బలం అయ్యేలా చేసుకోవాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. మరి ఈ ఎత్తుగడ జగన్ ని ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుందనేది చూడాలి.