ఏపీలో అధికార వైసీపీ ప్రతిపక్షాలని ఎదుర్కోవడానికి తమ దగ్గర ఉన్న అన్ని రకాల దారులని ఉపయోగించుకుంటుంది. ఓ వైపు కార్యకర్తలని రౌడీలుగా మార్చి టీడీపీ నాయకులపై భౌతిక దాడులు చేయిస్తుంది. గత స్థానిక సంస్థల ఎన్నికలలో ఇది ప్రత్యక్షంగా కనిపించింది. అలాగే కొద్ది రోజుల క్రితం మాచర్లలో జరిగిన ఘటన కూడా ప్రతిపక్షాలని లక్ష్యంగా చేసుకొని భౌతిక దాడులు చేయడం ద్వారా ఆ పార్టీ క్యాడర్ ని అలాగే ప్రజలని భయపెట్టాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటన సహజంగా కనిపించే అసహజ చర్య అని టీడీపీ ఆరోపిస్తుంది. రానున్న రోజుల్లో నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నాడు.
అలాగే పవన్ కళ్యాణ్ బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నాడు. ప్రతిపక్షాలు నిర్వహించే సభలు, రోడ్ షోలకి ప్రజలు రావడానికి కూడా భయపడేలా అల్లర్లు సృష్టించడం లేదంటే, తొక్కిసలాటలు జరిగే విధంగా కొంత మంది వైసీపీ కార్యకర్తలని సభల్లోకి పంపించి ప్రోత్సహించడం చేయబోతుంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటికి ట్రైల్ గానే చంద్రబాబు సభలలో జరిగిన తొక్కిసలాట అని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో ద్వారాలు తెరవడం ద్వారా జనసేన, టీడీపీకి బలంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల ఓట్లకి బారీగా గండికోట్టాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో జగన్ కి అండగా నిలబడేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా జనసేన, టీడీపీకి చెందిన నేతలని పార్టీలోకి తీసుకుంటున్నారు.
ఇక ప్రతిపక్షాల ఆర్ధిక మూలాల మీద దెబ్బ కొట్టి ఎన్నికల సమయంలో వారు ఓటర్లకి పంచడానికి డబ్బు లేకుండా చేయాలని భావిస్తున్నట్లు టాక్. టీడీపీకి ఎన్నారైల నుంచి కోట్లాది రూపాయిల పార్టీ ఫండ్ వస్తుంది. గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీలో జరిగిన తొక్కిసలాటకి బాధ్యుడిగా ఉయ్యూరు శ్రీనివాసరావుని చేశారు. అతనిని ఎ1గా మార్చి అరెస్ట్ చేశారు. అతను పార్టీకి కోట్లాది రూపాయిల ఫండ్ ఇస్తున్నాడు.
ఉయ్యూరు శ్రీనివాస్ ని అరెస్ట్ చేయడం ద్వారా మిగిలిన ఎన్నారైలు ఎవరైన టీడీపీ సహకరిస్తే ఇదే గతి పడుతుందని పరోక్షంగా హెచ్చరించినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇదే విషయాన్ని టీడీపీకి చెందిన ఎన్నారై కోమటి జయరాం కూడా పరోక్షంగా చెప్పడం విశేషం. ఇలా నాలుగు అంచెల వ్యూహంతో ప్రతిపక్షాలని అసెంబ్లీ ఎన్నికల లోపే దెబ్బ కొట్టడానికి అధికార వైసీపీ సిద్ధం అయ్యిందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
Advertisement