జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అలాగే చంద్రబాబుపైన వైసీపీ నేతలు చేసే మొదటి విమర్శ దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి. ఒంటరిగా పోటీ చేసి గెలిచే దమ్ము లేదు. ఈ విమర్శలు మాటిమాటికి చేస్తూ ఉంటారు. అధిష్టానం నుంచి కూడా ఇదే స్క్రిప్ట్ పార్టీ నేతలకి వస్తుంది. దీనికి కారణం ఉంది. 2014 ఎన్నికలలో జనసేన పార్టీ ఎలాంటి సీట్లు ఆశించకుండా టీడీపీకి మద్దతు ఇచ్చింది. దీంతో అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ, టీడీపీ మధ్య అప్పుడు ఉన్న ఓటు వ్యత్యాసం కేవలం 5 శాతం మాత్రమే. ఇక 2019 ఎన్నికలలో జనసేనాని టీడీపీకి దూరమై ఒంటరిగా ఎన్నికలకి వెళ్ళారు. దీంతో రెండు పార్టీలు దారుణ పరాభవాన్ని చూసాయి. వైసీపీకి భారీ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు. ఇది తప్పనే విషయం తరువాత ఇద్దరు రియలైజ్ అయ్యారని చెప్పాలి. ఈ నేపధ్యంఓ 2024 ఎన్నికలలో అలాంటి తప్పు జరగకుండా చూడాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
చంద్రబాబు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. అయితే కొన్ని కారణాల వలన జనసేనాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే పొత్తు తర్వాత ఏ ఎన్నికలలో కూడా ఇద్దరు కలిసి ఉమ్మడి కార్యాచరణతో కార్యక్రమాలు చేసింది లేదు. అలాగే స్థానిక ఎన్నికలలో కలిసి పోటీ చేసింది కూడా లేదు. పొత్తు ధర్మంలో భాగంగానే పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీని అడిగారు. అయితే దానిపై ఇప్పటి వరకు బీజేపీ రియాక్ట్ కాలేదు. ఈ నేపధ్యంలో వైసీపీని గద్దె దించాలంటే మళ్ళీ టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడి పోరు చేయాల్సిందే అని రెండు పార్టీల అధినేతలు భావిస్తున్నారు. దాని కోసం ఇప్పటికే అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత వైసీపీ నేతలకి నిద్ర పట్టడం లేదు. మళ్ళీ జనసేన, టీడీపీ గెలిస్తే 2014 ఎన్నికలలో వచ్చినన్ని స్థానాలు కూడా తమకి రావనే భయంతో ఉన్నారు.
ఐ-ప్యాక్ సర్వే ద్వారా ఇదే నివేదికని జగన్ కి ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే వారు వ్యూహాత్మకంగా జనసేన, టీడీపీ కలవకుండా అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. భౌతిక దాడులు, వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా వారి ఆత్మాభిమానం దెబ్బ తీయాలని ఇద్దరు ఒంటరి పోరుకి వెళ్ళేలా చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆవేశంతో రాజకీయాలు చేస్తారు. అతన్ని రెచ్చగొడుతూ ప్యాకేజీ స్టార్, టీడీపీ కోసమే పవన్ పని చేస్తున్నారు అని పదే పది చెప్పడం ద్వారా ఆత్మాభిమానం దెబ్బ తీయాలని భావిస్తున్నారు. అలాగే జనసైనికులు, పవన్ వెంట నడవాలని అనుకునే వారిని రెచ్చగొట్టడం ద్వారా చంద్రబాబుకి వ్యతిరేకంగా వారిని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా చేస్తే అయితే పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరంగా ఉంటారు. ఒక వేళ కలిసిన ఇంతకాలం పవన్ వెంట నడిచి అతనికి ఓట్లు వేయాలని అనుకునేవారి ఓటింగ్ పూర్తిగా జనసేన కోల్పోతుంది.
ఈ రెండింట్లో ఏది జరిగిన అది వైసీపీకి కలిసొచ్చే అంశమే. దీనినే గ్రహించి వైసీపీ రాజకీయం చేస్తుంది. ఇక వైసీపీ వ్యూహం గ్రహించిన పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ వ్యూహాలు తనకి వదిలేయాలని, రానున్న ఎన్నికలలో జనసేనని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠంపై మీరు కోరుకున్న విధంగా నేను కూర్చుంటా అని చెబుతున్నారు. దీంతో జనసైనికులు కూడా పవన్ కళ్యాణ్ మీదనే పూర్తి భరోసా పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్, టీడీపీతో పొత్తు పెట్టుకున్న అది వ్యూహంలో భాగంగానే ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒకప్పటిలా టీడీపీని గుడ్డిగా వ్యతిరేకించకుండా పవన్ ఆలోచనలతో ప్రయాణం చేయడానికి సిద్ధం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొట్టు పెట్టుకొని వైసీపీని ఓడించాలని భావిస్తున్నారు.