బాలకృష్ణ తాజాగా సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. ముఖ్యంగా రాయలసీమతో పాటు, నందమూరి ఫ్యాన్స్ నుంచి మూవీకి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని పాత్రలతో పాటు సంభాషణలు కూడా వైసీపీని లక్ష్యంగా చేసుకొని రాసినట్లు ఉన్నాయి. దీంతో సినిమా రిలీజ్ తర్వాత వైసీపీ శ్రేణులు ఈ మూవీని ఫ్లాప్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అలాగే డైలాగ్స్ మీద తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా టీమ్ ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా వీరసింహారెడ్డిలో బాలయ్య డైలాగ్స్ ని ఉద్దేశించి విమర్శలు చేయడం విశేషం.
ఇక సినిమాలో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు ఉననయనే టాక్ స్ప్రెడ్ కావడంతో కొంత మంది ప్రభుత్వ ప్రతినిధులు ఈ మూవీని చూశారు. వారు ప్రభుత్వంపై విమర్శలు వాస్తవమే అనే విషయాన్ని జగన్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో బాలకృష్ణపై విమర్శల దాడిలో వైసీపీ స్పీడ్ పెంచింది. ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ కూడా ఈ సినిమాలోని డైలాగ్స్ ఉద్దేశించి మాట్లాడారు. తన వీరసింహారెడ్డి సినిమా ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులకి అద్దం పట్టే విధంగా చాలా సన్నివేశాలు ఉంటాయని చెప్పారు.
అలాగే ఆ డైలాగ్స్ ఎవరిని ఉద్దేశించి చేసినవి అనేది ప్రజలందరికి తెలుసనీ కూడా కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీ రోజులని తలపిస్తున్నాయని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి మొదలు పెట్టారు. భావ కళ్ళల్లో ఆనందం కోసం సొంత తండ్రికి బాలయ్య వెన్నుపోటు పొడిచాడని పాత పల్లవినే పట్టుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా టీమ్ తో మరో వైపు నెగిటివ్ ప్రచారాన్ని చేయిస్తున్నారు.