రాజకీయాలలో ప్రత్యర్ధులకి నిద్రలేని రాత్రులు మిగల్చడం అంటే ఏమిటో తాజాగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ చూసాక అందరికి అర్ధమవుతుంది. బయటకి వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల మీద కుట్రలు చేస్తూ వారి మీద భౌతికంగా, మానసికంగా ఎదురుదాడి చేసి ఎదుగుదలని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయాలలో అన్ని పార్టీలది ఒక శైలి అయితే వైసీపీది మరో పద్ధతి. ఎప్పుడో 80, 90 దశకంలో పార్టీలు, నాయకులు రిగ్గింగ్ లు చేస్తూ, ప్రత్యర్ధులపై దాడులు చేస్తూ అస్సలు తమకి పోటీ లేకుండా చేసుకొని ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు. టాలీవుడ్ లో ప్రతిఘటన, కర్తవ్యం లాంటి సినిమాలు ఎప్పుడు వచ్చాయో అందరికి తెలిసిందే.
ఈ 21వ శతాబ్దంలో వైసీపీ అదే తరహా రాజకీయం ఇప్పుడు చేయాలని ప్రయత్నం చేస్తుంది. అస్సలు ప్రత్యర్ధుల నుంచి పోటీ లేకుండా చేసుకొని ఎన్నికలలో గెలవాలని వ్యూహాలు రచిస్తుంది. ఆ వ్యూహాలని స్థానిక సంస్థల ఎన్నికలలో అమలులో పెట్టి చాలా వరకు విజయం సాధించింది. అయితే స్థానిక ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాగే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కూడా భయపడిపోయే స్థితిలో లేరు. యాక్షన్ కి రియాక్షన్ అన్నట్లుగానే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే గతం ఎన్నికలలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడిగా పోటీ చేయడం వలన భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీ వచ్చే ఎన్నికలలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని భయపెట్టి, బెదిరించి మళ్ళీ గెలవాలని చూస్తుంది.
అలాగే జనసేన, టీడీపీ కలవకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రతిసారి వైసీపీ బోల్తా పడుతుంది. విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ ని హోటల్ లో నిర్భందిస్తే అది తిరిగి వైసీపీకి మైనస్ అయ్యింది. ఇక వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పై సోషల్ మీడియాలో ఇష్టారీతిలో రెచ్చిపోతే అప్పటికే రిజిస్ట్రేషన్ అయ్యి వారం రోజులు అయ్యిందనే విషయం బయట పెట్టడం ద్వారా అందరిని ఫూల్స్ చేశారు. ఇక ఇక తాజాగా ఊహించని విధంగా కనీసం మీడియాకి కూడా లీక్ లేకుండా ఈ రోజు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలిసి రెండున్నర గంటలకి పైగా చర్చించారు.
వీరి భేటీతో ఒక్కసారిగా వైసీపీలో టెన్షన్ మొదలైంది. ఇక పవన్ కళ్యాణ్ పై ఎదురుదాడి చేయడంతో పాటు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సీట్ల గురించి చర్చించారని, ఏఏ స్థానాలు కావాలో కూడా అడిగి ఫైనల్ చేసుకున్నారని వైసీపీ కొత్త ప్రచారం తెరపైకి తీసుకొచ్చింది. అయితే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికరంగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు ప్యాంట్లు తడిసిపోతున్నాయని అన్నారు.