సౌత్ స్టార్ సమంత తాజాగా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పటికి భారీ కలెక్షన్స్ తో ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తుంది. హరి హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని శివలెంక ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని భాషలలో మంచి హిట్ టాక్ తోనే దూసుకుపోతుంది. సరికొత్త కథాంశంతో సినిమా తెరకెక్కడం, అలాగే ఇప్పటి వరకు చూడని విధంగా సమంత యాక్షన్ సీక్వెన్స్ లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేయడంతో మంచి స్పందన వస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది.
ఇక తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ ని చిత్ర యూనిట్ నిర్వహించింది. ఇందులో భాగంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ యశోద సీక్వెల్ కోసం కథ సిద్ధంగా ఉందని, దీనిని తెరకెక్కించడానికి రెడీగా ఉన్నామని, అయితే దీనికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తే సరిపోతుందని తెలిపారు. మొదటి పార్ట్ కంటే మరింత రిచ్ గా సరికొత్త కథాంశంతో సీక్వెల్ ని సిద్ధం చేస్తామని దర్శకద్వయం తెలియజేశారు. ఇక సమంత హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ముగించుకొని వచ్చిన తర్వాత యశోద సీక్వెల్ గురించి ఆమెతో చర్చిస్తామని దర్శకులు తెలిపారు.
ప్రస్తుతం సమంత చేతిలో శాకుంతలం సినిమా ఉంది, అలాగే హిందీలో ఒక యాక్షన్ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో వైపు హాలీవుడ్ మూవీ కూడా చేయనుంది. ఆమె ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకొని ఫిట్ గా బయటకొస్తే ఇవన్నీ సెట్స్ పైకి వెళ్ళాలి. ఈ నేపధ్యంలో యశోద సీక్వెల్ గురించి సమంత ఇప్పట్లో ఆలోచిస్తోందా అనేది చెప్పలేని పరిస్థితి. ఒక వేళ చేసిన చాలా సమయం పెట్టె అవకాశం ఉంటుంది.