సమంత లీడ్ రోల్ లో హరి, హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ యశోద తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ యూఎస్ లో పడ్డాయి. సమంత కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ జరిగిన చిత్రంగా ఇది నిలిచింది. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ లాంటి స్టార్స్ ఈ మూవీలో నటించారు. సరోగసి ఎలిమెంట్ తో ఈ మూవీని తెరకెక్కించినాట్లు ఇప్పటికే ట్రైలర్ గా చెప్పేసారు. అలాగే అంతకుమించిన థ్రిల్లర్ పాయింట్స్ కూడా చిత్రంగా ఉంటాయని దర్శకులు చెప్పారు. ట్రైలర్ రీచ్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సమంత హెల్త్ ప్రాబ్లెమ్ కారణంగా సినిమా ప్రమోషన్స్ తక్కువగా చేసినా కూడా ప్రేక్షకులలోకి బాగానే రీచ్ అయ్యింది.
దీంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఏకంగా 55 కోట్ల టార్గెట్ గా ఈ మూవీ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వస్తున్నట్లు తెలుస్తుంది. ట్విట్టర్ లో ప్రీమియర్ షోలు చూస్తున్న వారు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా సినిమా ఉందనే మాట వినిపిస్తుంది. ఫస్ట్ హాల్ఫ్ ఇంటరెస్టింగ్ గా ఉండటంతో పాటు ఎంటర్టైన్ చేస్తుందని, ఇక సెకండ్ హాల్ఫ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆధ్యాంతం ఆకట్టుకుంటుందని ట్విట్టర్ లో వినిపిస్తుంది. సినిమా చివరి 20 నిమిషాల ఎపిసోడ్ హైలైట్ గా నిలిచిందని టాక్. ఇక సమంత భిన్నమైన షేడ్స్ గా సినిమాని ఆధ్యాంతం తన భుజాలపై వేసుకొని నడిపించిందని తెలుస్తుంది.
సమంతని ఎందుకు బెస్ట్ యాక్టర్స్ అంటారో ఈ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఇక సమంత తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన పాత్రని వరలక్ష్మి శరత్ కుమార్ చేసింది. రెగ్యులర్ గా భిన్నమైన కథలతో, పాత్రలని ఎంపిక చేసుకుంటూ మూవీస్ చేస్తున్న వరలక్ష్మిఖాతాలో మరో డిఫరెంట్ రోల్ మూవీగా ఈ సినిమా నిలుస్తుంది. ఇక మిగిలిన పాత్రలు కూడా ఎవరి పరిధి మేరకు వారు బాగా నటించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణంగా నిలిచింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.
సొసైటీలో మన కంటికి నార్మల్ గా కనిపించే చాలా విషయాలలో బయటకి ప్రపంచానికి తెలియకుండా ఎన్నో రహస్యాలు ఉంటాయని దర్శకద్వయం చెప్పే ప్రయత్నం చేశారు. దీనికోసం వారు ఎంచుకున్న కథనం, ప్రత్యేకంగా వేసిన ఇవా ఇన్స్టిట్యూట్ కూడా కొత్తగా ఉంటూ ప్రేక్షకులకి కొత్త కథని చూస్తున్న ఫీలింగ్ అందించింది. ఎక్కడా కూడా రెగ్యులర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ లేదని ఆడియన్స్ నుంచి రివ్యూ వస్తుంది. కచ్చితంగా సమంత ఖాతాలో ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని వేసుకుంటుందని టాక్.