సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన యశోద సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కింది. మాయోసైటిస్ డిసీజ్ కారణంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండటంతో సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొనలేకపోతుంది. కానీ హాస్పిటల్ లోనే యాంకర్ కి సుమకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ బాగానే వైరల్ అయ్యింది. అందులో సినిమా గురించి అలాగే తన అనారోగ్యం గురించి చాలా విషయాలని సమంత చర్చించింది. ఇక సినిమా ప్రమోషన్ బాధ్యత అంతా దర్శకులు, నిర్మాత చూసుకుంటున్నారు.
యశోద ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ టాక్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుందనే నమ్మకంతో దర్శకద్వయం హరి హరీష్ ఉన్నారు. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై చూడనటువంటి కథతో యశోద సినిమాని ఆవిష్కరించామని వారు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తెలుగులో వారికిది మొదటి సినిమా అయినా తమిళంలో మాత్రం ఇప్పటికే నాలుగు సినిమాలు చేశారు. వారి కెరియర్ లో కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం యశోదనే. ఇక ఈ సినిమాని 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు నిర్మాత శివలెంక ప్రసాద్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
సమంత స్టార్ ఇమేజ్, కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో డిస్టిబ్యూటర్స్ ముందుకొచ్చి చిత్రాన్ని భారీ ధరలు చెల్లించి కొనుగోలు చేశారు. దీంతో థీయాట్రికల్ బిజినెస్ గట్టిగానే జరిగింది. రిలీజ్ అవుతున్న అన్ని భాషలలో యశోద 55 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలుపుకుంటే ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అంటే నిర్మాతగా రిలీజ్ కి ముందే సినిమాపై పెట్టిన పెట్టుబడికి మించి ఆదాయం వచ్చేసింది. 55 కోట్ల బిజినెస్ అంటే టైర్ 2 హీరో రేంజ్ లో యశోద సినిమాపై వ్యాపారం జరిగింది. ఈ మూవీ గాని సక్సెస్ అయ్యి భారీ కలెక్షన్స్ సాధిస్తే మాత్రం సమంత ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. అలాగే ఈ ఇంపాక్ట్ సమంత నెక్స్ట్ మూవీ శాకుంతలం మీద కూడా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.