సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ గా హరి, హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యశోద. సరోగసి మెయిన్ ఎలిమెంట్ గా ఈ సినిమాని దర్శకద్వయం తెరకెక్కించారు. శివలెంక ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీలో పేదరికంతో అద్దెగర్భం మోసే ఒక సాధారణ వివాహితగా, అలాగే ప్రమాదం నుంచి బయటపడటానికి సాహసాలు చేసే వనితగా భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో సమంత ఈ మూవీలో కనిపించబోతుంది అని ట్రైలర్ బట్టి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ నెల 11న యశోద సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని అన్ని భాషలలో స్టార్ట్ చేశారు. సమంత హాస్పిటల్ లో ఆటో ఇమ్యునో వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండటంతో ఆమె ప్రచారం కేవలం సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం అయ్యింది.
మిగిలిన క్యాస్టింగ్ అందరూ మీడియా ముందుకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. కంటెంట్ మీద నమ్మకం, అలాగే సమంత ఇమేజ్ తో సినిమాకి మంచి బజ్ వస్తుందని, మొదటి రోజు ఆడియన్స్ థియేటర్స్ కి వస్తే ఆ మౌత్ టాక్ తోనే సినిమా జనాల్లోకి వెళ్తుందని భావిస్తున్నారు. దర్శకద్వయం కూడా తన సినిమా ప్రమోషన్స్ ని విస్తృతం చేశారు. ఇక నిర్మాత శివలెంక ప్రసాద్ కూడా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత యశోద సినిమాని అతను నిర్మించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఏకంగా 40 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు నిర్మాత తెలియజేశారు.
కంటెంట్ డిమాండ్ బట్టి ఆ స్థాయిలో బడ్జెట్ పెట్టాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ఇక ఫీమేల్ సెంట్రిక్ కథమీద ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టడం రిస్క్ అయిన కూడా సమంత ఇమేజ్, కంటెంట్ పై నమ్మకం ఈ స్థాయిలో ఖర్చు చేయడానికి కారణమని నిర్మాత చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుందనే అభిప్రాయం వినిపిస్తుంది. మరి యశోద సినిమాతో సమంత హిట్ కొడితే మాత్రం అరుదైన రికార్డ్ ని తన సొంతం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఫీమేల్ లీడ్ గా సమంత ఇమేజ్ కూడా మరింతగా యశోద సినిమాతో ఎస్టాబ్లిష్ అవుతుంది.