స్టార్ హీరోయిన్ సమంత సోలోగా యశోద సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులని అలరించడానికి ముందుకొచ్చింది. భారీ హైప్ తో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అనారోగ్యం కారణంగా సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. అయినా కూడా ఇంత వరకు ఆమెకున్న హైప్ తో ఫస్ట్ డే ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. ఓ విధంగా చెప్పాలంటే అక్కినేని హీరోలైన నాగ చైతన్య, నాగార్జున కంటే సమంత యశోద సినిమాకి ఎక్కువ వ్వ్నింగ్ కలెక్షన్ రావడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొదటి రోజు యశోద. 6.81 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకి మౌత్ టాక్ బాగానే వస్తుంది.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ మూవీగా యశోద ప్రేక్షకులని అలరిస్తుంది. అలాగే సమంత వన్ విమెన్ షోతో ఈ సినిమా కథని తన భుజాలపై మోస్తూ తీసుకెళ్లింది. క్యారెక్టర్ లో రెండు భిన్నమైన షేడ్స్ ని చూపించి ఆకట్టుకుంది. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా సమంత బెస్ట్ అనిపించుకుంది. సినిమాకి ఒక్క క్లైమాక్స్ మినహా మొత్తం బాగుందనే మాట ప్రేక్షకుల నుంచి వస్తుంది. ఆ ముగింపు కూడా యశోద సీక్వెల్ కి సరిపోయే విధంగా సెట్ చేసి దర్శకులు వదిలేశారు.
ఈ కారణంగానే పెద్ద ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ లేకుండా సింపుల్ గా కథని ముగించేశారు. ఇదిలా ఉంటే రెండో రోజు కూడా యశోద 6 కోట్లకి పైగానే గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజులలో యశోద మూవీ కలెక్షన్స్ 13 కోట్లకి చేరువ అయిపోయాయి. ఇక బ్రేక్ ఈవెన్ రావాలంటే మరో 7 కోట్లు కలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఆ మొత్తం కూడా మూడో రోజు వచ్చేస్తుందని భావిస్తున్నారు. లాంగ్ రన్ లో ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదనే మాట విమర్శకుల నుంచి వినిపిస్తుంది.