సమంత లీడ్ రోల్ లో హరి, హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన యశోద తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. డిఫరెంట్ థ్రిల్లర్ ని చూసిన ఫీలింగ్ కలిగిందని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి విశేష స్పందన రావడంతో చిత్ర యూనిట్ మొత్తం ప్రేక్షకులకి థాంక్స్ చెప్పారు. ఇక సమంత కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ఇదే కాగా, అలాగే హైయెస్ట్ బిజినెస్ జరిగిన సోలో ఫిల్మ్ ఇదే కావడం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ మౌత్ టాక్ తో మెల్లగా కలెక్షన్స్ పుంజుకుంటుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. ఇక మాయోసైటిస్ తో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంతకి ఈ సినిమా కొంత మానసిక ఉపశమనం అందించింది అని చెప్పాలి.
ఇక ఓటీటీ ఆడియన్స్ కి కూడా ఈ మూవీ విపరీతంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ఛానల్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ విషయం తాజాగా ధ్రువీకరించారు. ఇక అమెజాన్ ప్రైమ్ లో చాలా రోజుల తర్వాత రాబోతున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. యశోద మూవీకి సంబందించిన అన్ని భాషలకి కలిపి ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక వీలైనంత వేగంగా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఛానల్ సిద్ధం అవుతుందని సమాచారం. ఇక యశోద హిట్ టాక్ తో మరోసారి సమంత యాక్షన్ హీరోయిన్ గా తనకున్న ఫేమ్ ని ఇండియన్ వైడ్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంది. సమంతని ఇప్పటి వరకు గ్లామర్ క్వీన్ గానే తెలుగు ఆడియన్స్ చూశారు. అయితే తనలో ఒక యాక్షన్ క్వీన్ కూడా ఉందని ఈ మూవీతో సామ్ ప్రూవ్ చేసుకుంది. ఈ నేపధ్యంలో భవిష్యత్తులో కొత్త దర్శకులు డిఫరెంట్ కథలతో సమంతని యాక్షన్ క్వీన్ గా ఎస్టాబ్లిష్ చేస్తారేమో చూడాలి.