Yash : యశ్ అంటే ఇప్పుడు ఒక స్టార్ కాదు ఒక బ్రాండ్. కేజిఎఫ్ మూవీ ఈ స్టార్ హీరో కథ మొత్తాన్ని మార్చేసింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ స్థాయికి చేర్చింది. తనదైన స్టైలిష్ లుక్స్ తో యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు యాష్. సౌత్ లో ఈయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏ యొక్క ఈవెంట్లో యశ్ ప్రత్యక్షమైనా అక్కడ లక్షలాది మంది అభిమానులు గుమిగూడి ఆయనకు నీరాజనాలు పలుకుతారు. ఒక్క ఫోటో అయినా దిగాలన్న తాపత్రయంతో తహతలాడుతుంటారు. అయితే తాజాగా యశ్ చేసిన ఓ పనికి అభిమానులు ఆయనకు పూర్తిగా ఫిదా అయిపోయారు. స్టార్ అంటే ఇతనే అని నిరూపించుకున్నాడు.

బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యశ్ హాజరయ్యారు. ఇక స్థానికంగా ఉన్న ప్రజలు ఫ్యాన్స్ కుర్రాళ్ళు తమ అభిమాన నటుడిని చూసేందుకు ఈవెంట్ కు తరలివచ్చారు. యశ్ తో ఫోటో దిగేందుకు తెగ కుస్తీ పడ్డారు. ఒక్కసారైనా సెల్ఫీ దిగే అవకాశం ఇవ్వాలని ఈవెంట్ మేనేజర్ ను కోరగా అవకాశాన్ని ఇచ్చారు అందులోని గ్రూప్ ఫోటో మాత్రమే దిగాలని చెప్పారు. ఇది గమనించిన యశ్ తన అభిమానులను నిరుత్సాహపరచకూడదని నిర్ణయించుకుని వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడారు. గ్రూప్ ఫోటో కాదు ఏకంగా సెల్ఫీలకే అవకాశం ఇచ్చారు. ఒకటో రెండో సెల్ఫీలు అయితే పర్లేదు ఏకంగా 700 మందికి సెల్ఫీలు ఇచ్చి తన గొప్పతనాన్ని చాటాడు ఈ స్టార్ హీరో. యశ్ తో దిగిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ యశ్ రియల్ స్టార్ అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. అభిమానుల పట్ల యశ్ కు ఉన్న ఓర్పుకు ప్రేమకు ఫిదా అయిపోయారు.

కింది నుంచి పైకి వచ్చిన వ్యక్తి యశ్. ఒక ఒకప్పుడు సినిమాల్లో అవకాశం కోసం చాలా రకాల కష్టాలను ఎదుర్కొన్నాడు. బుల్లితెర పైన సీరియల్స్ లో నటుడిగా తలకెరుని ప్రారంభించి అనంతరం సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ హీరో స్థాయికి చేరుకున్నాడు. రాఖీ సినిమాతో ఫుల్ లెంగ్త్ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. పాన్ ఇండియారిలీజ్ అయిన సినిమా కేజిఎఫ్ తో ఈ స్టార్, స్టార్ పూర్తిగా మారిపోయింది. ఒకే ఒక్క సినిమా తన లైఫ్ ని టర్న్ చేసింది. కే జి ఎఫ్ 1, కేజీఎఫ్ 2 సూపర్ డూపర్ హిట్ కావడంతో కేజిఎఫ్ 3 కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రావడానికి కాస్త సమయం పట్టేటట్లు ఉంది.