Yami Goutam : పండుగ సీజన్‌లో బాలీవుడ్ సెలబ్రిటీలు రీఫ్రెష్ లుక్స్‌తో ఎత్నిక్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తున్నారు. నటి యామీ గౌతమ్ కూడా ఫ్యాషన్ ప్రియుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేవిధంగా లేటెస్ట్ ఎత్నిక్ కలెక్షన్‌ను ధరించి అదరగొట్టింది. ఇటీవల జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో డిజైనర్ ద్వయం శ్యామల్ , భూమికలు రూపొందించిన బ్లూమ్స్ ఆఫ్ ప్యారడైజ్ కలెక్షన్స్ నుంచి స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌ను వేసుకుని ర్యాంప్‌పైన సందడి చేసింది. విభిన్న రంగుల షేడ్స్‌లో పూల డిజైన్స్‌తో రూపొందించిన పాస్టెల్ పింక్ లెహెంగాను వేసుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది యామీ గౌతమ్. ఈ అవుట్‌ఫిట్ ధరించి చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను యామీ గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Yami Goutam : భారీ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన లెహెంగాను స్వీట్‌హార్ట్ నెక్‌లైన్‌తో వచ్చిన బ్లౌజ్‌తో జత చేసింది యామీ గౌతమ్. ఈ బ్యూటీ తన సాంప్రదాయ రూపానికి మరింత ట్విస్ట్ ఇచ్చేందుకు భుజానికి మ్యాచింగ్ దుపట్టాను వేసుకుంది . ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా చెవులకు డాంగ్లర్ ఇయర్‌రింగ్స్ ను పెట్టుకుంది. పెదాలకు పింక్ లిప్ స్టిక్, కనులకు ఐ లైనర్, మస్కరా, ఐ ష్యాడే వేసుకుని అదిరిపోయే ఎత్నిక్ లుక్స్‌తో ఫ్యాషన్ స్టేట్‌హెంట్స్ ఇచ్చేస్తోంది.

అందాల రాణి యామీ గౌతమ్ ధరించే ప్రతి అవుట్‌ఫిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మధ్యనే ఎప్పటిలాగే క్లిష్టమైన థ్రెడ్ వర్క్‌తో డిజైన్ చేసిన నీలిరంగు కుర్తా సెట్‌ను వేసుకుని స్టన్నింగ్ లుక్స్‌తో తన ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది యామీ గౌతమ్. ఈ కుర్తాకు జతగా నల్లటి ప్యాంటు ధరించి అద్భుతంగా కనిపించింది. నుదుటన నీలిరంగు బొట్టు పెట్టుకుని అందరిని అట్రాక్ట్ చేసింది.

యామీ గౌతమ్ ఫాలో అయ్యే ఎత్నిక్ లుక్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. రీసెంట్‌గా రెడ్ రా మ్యాంగో చీరను ధరించి అందరిని మెస్మరైజ్ చేసింది . గోల్డెన్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో డిజైన్ చేసిన ఈ రెడ్ చీరను సాంప్రదాయంగా కట్టుకుని తలపై కొంగు కప్పుకుని రెట్రో లుక్‌లో నటి అందరి మనసును గెలిచింది. తన లుక్‌కు మరింత అందాన్ని తీసుకువచ్చేందుకు చేతికి ఎర్రటి గాజులు నుదుటన పాపట బిల్ల పెట్టుకుని మెరిసిపోయింది.

