Women Death : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెండు కుటుంబాల మధ్య వచ్చిన గొడవ పద్మావతి అనే మహిళ మృతికి కారణమైంది. చూస్తుండగానే మహిళ ప్రాణం పోతుండటంతో కాలనీ వాసుల అంతా నివ్వేరా పోయారు. ఇక అసలు విషయానికి వస్తే శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో పట్టణంలోని మాసానం పేట కు చెందిన పద్మావతి గృహిణి. రోజులాగే పద్మావతి బట్టలు పిండేందుకు వాషింగ్ మిషన్ ఉపయోగించింది. అయితే బట్టలు ఉతగ్గా వాషింగ్ మిషన్ నుంచి వచ్చిన వృధా నీరు ఆ పక్కనే ఉన్న వారి ఇంటి వైపు వెళ్లడంతో అసలు రచ్చ మొదలైంది.

పక్కింటివాడైన వేమన్న నాయక్ మా ఇంటి ముందు నుంచి మురుగునీరు పోతుంది అంటూ పద్మావతితో గొడవకు దిగాడు. పద్మావతి కూడా వాగ్వాదానికి దిగింది. దీంతో రెండు కుటుంబాలు నువ్వా నేనా అంటూ పెద్ద గొడవకు దిగాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో వేమన్న నాయక్ కుటుంబ సభ్యులు బండరాలతో పద్మావతి కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. ఈ గొడవలో పద్మావతి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమె ముఖం పైన కూడా దెబ్బలు తగిలాయి. అప్పటికే పరిస్థితి విషమించడంతో పద్మావతిని స్థానికంగా ఉన్న ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అయితే వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూనే పద్మావతి మృతి చెందింది. పద్మావతి చావుకు కారణం అయినా వారి పైన కేసు నమోదు చేశారు పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా పద్మావతి కేసు అందరినీ ఆలోచింపజేసింది.

కూర్చుని పరిష్కరించుకునే సమస్యలను కూడా తెగేదాక తీసుకొచ్చి విచక్షణను కోల్పోయేలా చేస్తుందంటూ కాలనీవాసులు చెబుతున్నారు. ఓ నిండు ప్రాణం పోవడంతో ఆ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.