Beauty Contest : ఇటీవలి కాలంలో యువతులు, మహిళలే కాదు.. చిన్నారులు సైతం మేకప్ లేకుండా బయట కనిపించేందుకు ఇష్టపడరు. ఇక పార్టీలు, పెళ్లిళ్లు, ఫంక్షన్స్ అంటే ఓ రేంజ్‌లో రెడీ అవుతారు. అలాంటిది అందాల పోటీలంటే ఇంక ఎలా రెడీ అవుతారో ప్రత్యేకంగా చెప్పాలా? ఒక మేకప్ మ్యాన్‌ని పెట్టుకుని మరీ అందంగా రెడీ అవుతారు. కానీ ఎలాంటి మేకప్ లేకుండా అందాల పోటీల్లో పాల్గొనేందుకు ఎవరైనా సాహసిస్తారా? ఒక్కరు మాత్రం సాహసించారు. దీంతో ఆమె చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన మిస్ ఇంగ్లండ్ పోటీల్లో సహజ అందంతో ఫైనల్‌కు చేరుకుని ఓ మోడల్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
లండన్‌కు చెందిన 20 ఏళ్ల మోడల్ మెలిస్సా రవూఫ్ ఇటీవల జరిగిన మిస్ ఇంగ్లండ్ పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో ఏకంగా సెమీ ఫైనల్ రౌండ్‌లో మేకప్ లేకుండా మెలిస్సా రవూఫ్ ప్రవేశించింది. ఆమెను చూసి న్యాయ నిర్ణేతలను సైతం షాక్ అయ్యారు. సెమీ ఫైనల్ రౌండ్‌లో మేకప్ లేకుండా పాల్గొనాలంటే ఎన్ని గట్స్ ఉండాలి? ఇక్కడి వరకూ వచ్చి ఎవరైనా ఛాన్స్ తీసుకుంటారా? కానీ మెలిస్సా తీసుకుంది. 94 ఏళ్ల అందాల పోటీల చరిత్రలో ఇలా సహజ సౌందర్యంతో ఫైనల్స్‌కు చేరిన తొలి మోడల్‌గా మెలిస్సా రవూఫ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. పొలిటిక్ సైన్స్‌ను అభ్యసిస్తున్న మెలిస్సా అందాల పోటీలో ఫైనల్‌కు చేరడంపై స్పందించింది.
Beauty Contest : సంతోషంగా ఉండేవారు ముఖాన్ని మేకప్‌తో కప్పుకోవాల్సిన అవసరం లేదు..
అంతేకాదు.. మెలిస్సా ఒక గొప్ప సత్యాన్ని కూడా ఇక్కడ చెప్పుకొచ్చింది. నిజమైన అందం సింప్లిసిటీలో ఉందని తెలిపిన మెలిస్సా.. నిత్యం నవ్వుతూ సంతోషంగా ఉండేవారు తమ ముఖాన్ని మేకప్‌తో కప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. అలాగే అమ్మాయిలు తమ సహజ సౌందర్యం పట్ల ఎలాంటి ఆత్మనూన్యత భావం లేకుండా ఉండాలనే సందేశం ఇచ్చేందుకే ఇలా మేకప్ లేకుండా పోటీలో పాల్గొన్నానని తెలిపింది. మొత్తంగా సెప్టెంబర్ నెలలో జరిగే ఫైనల్ పోటీల్లో మెలిస్సా కిరీటాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. అయితే విషయం తెలుసుకున్న నెటిజన్లు మాత్రం విజయం ఆమెనే వరించాలని కోరుకుంటున్నారు.