Winter : రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో తీవ్రమైన చలి ప్రజలను వణికిస్తోంది. సాధారణాన స్థాయికి మించి చలి తీవ్రత పెరగడంతో ప్రజలు అల్లాడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 9, 10 గంటలు దాటినా మంచు తెరలు తొలగడం లేదు.

ఈ రోజు కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చలికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ కాదు దేశవ్యాప్తంగా చలి తీవ్రత గత వారం రోజులుగా పెరుగుతూనే ఉంది. ఇక అల్పపీడనం ప్రభావంతో చెన్నై లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది.
పక్క దేశాల్లోనే చలి తన పంజా విసురుతోంది. అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో అమెరికా ప్రజలు అల్లాడుతున్నారు. చలి తీవ్రతకు తోడు మంచు దుప్పటి పరచుకోవడంతో ప్రజలు ఇంటి నుంచి బయటి వచ్చేందుకే జంకుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో చలి కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇళ్లల్లో హీటర్స్ పనిచేయని పరిస్థితి నెలకొంటోంది. మంచు తుఫాను ప్రభావం ఉండటంతో చలి తీవ్రతకు తట్టుకోలేక అమెరికాలో 24 మంది ప్రజలు మరణించారు.


బాంబ్ సైక్లోన్ ప్రభావంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందని అమెరికా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎక్కడికక్కడ మంచు కురుస్తుండటంతో పాటు చలి గాలులు వీస్తుండటంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకువ్చేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.