Prabhas : ‘బాహుబలి’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ‘డార్లింగ్’ ప్రభాస్. ఆ సినిమాలో ఈ యంగ్ రెబల్ స్టార్ ఎలా ఉన్నాడు? వావ్ అనిపించాడు కదా.. తరువాత వచ్చిన సాహోలో కూడా పర్వాలేదనిపించాడు. కానీ ఆ తరువాత వచ్చిన చిత్రమే ఏంటి ప్రభాసేనా? అనిపించింది. ‘రాధేశ్యామ్’లో ప్రభాస్ లుక్‌పై వచ్చిన కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. ఇలా అయితే కష్టమేనంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. లుక్ మహిమో ఏమో కానీ బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయాయి. ఒకరకంగా ఈ రెండు సినిమాలు ప్రభాస్ క్రేజ్‌ను అంతో ఇంతో తగ్గించడంలో సాయపడ్డాయి. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో కానీ డార్లింగ్ లుక్ మార్చాడు. బరువు తగ్గాడు. ట్రిమ్ చేసిన గడ్డంతో తిరిగి పాత ప్రభాస్‌ను గుర్తుకు తెస్తున్నాడు.
పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ఆదిపురష్, సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే గత కొద్ది కాలంగా తన కాలి నొప్పితో బాధపడుతున్న ప్రభాస్.. ఫిట్‌నెస్‌పై పెద్దగా శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఇటీవల ఆయన కాలికి సర్జరీ కూడా జరిగిందని ఒక ప్రొడ్యూసర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో ప్రభాస్ బరువు పెరిగి బొద్దుగా కనిపించాడు. తమ అభిమాన హీరో శరీరాకృతిలో వచ్చిన మార్పును చూసి అభిమానులు కాసింత కలత చెందారు. కానీ తాజాగా ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
Prabhas : ‘లుక్ అదిరింది బాస్’, ‘డార్లింగ్ బ్యాక్’ అంటూ కామెంట్స్
చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ మీడియా ముందుకు వచ్చాడు. బుధవారం జరిగిన ‘సీతారామం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ‘డార్లింగ్’ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ ఈవెంట్‌లోనే ప్రభాస్ లుక్ చూసి అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. స్లిమ్‌గా అయిపోయి.. ట్రిమ్డ్ గడ్డం, బ్లాక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్‌తో వావ్ అనిపించాడు. సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘లుక్ అదిరింది బాస్’, ‘డార్లింగ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ న్యూలుక్ ప్రభాస్‌కు లక్ తేవడం ఖాయమని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. నెక్ట్స్ రిలీజ్ అయ్యే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయని చెబుతున్నారు.