BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ లో ఇప్పటికే శానీ, అభినయ, నేహా ఎలిమినేట్ అయ్యారు. వీరిలో శానీ, అభినయ రెండో వారంలో ఎలిమినేషన్ అవగా, నేహా మూడో వారంలో ఎలిమినేట్ అవడం జరిగింది. ఇక నాల్గవ వారంలో ఎప్పటి లాగే మొదటి రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. నామినేషన్ల ప్రక్రియ జరిగే ముందు సోమవారం ఎపిసోడ్ లో కీర్తికి సంబంధించిన కొన్ని సీన్లు వచ్చాయి.
కీర్తీ సినిమాలతో పాటు టెలివిజన్ స్క్రీన్ మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె ప్రధానంగా తెలుగు మరియు కన్నడ పరిశ్రమలలో నటిగా పనిచేసింది. కీర్తి 2017లో ఐస్ మహల్ అనే కన్నడ చిత్రంతో తొలిసారిగా నటించింది. కీర్తి మంగళూరులో పుట్టి, బెంగళూరులో పెరిగారు. అక్కడ పాఠశాల విద్యను అభ్యసించి భరతనాట్యం నేర్చుకున్నారు. కార్తీక దీపం అనే డైలీ సీరియల్‌లో హిమ పాత్రలో నటించిన కీర్తి పాపులర్ అయ్యింది.

దీంతో తెలుగు టెలివిజన్ లో అత్యంత పాపులర్ అయినటువంటి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ గా అవకాశం దక్కించుకుంది. హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఆమె మొదటి కంటెస్టెంట్‌గా గ్రాండ్ ఎంట్రీతో హౌస్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న కీర్తి సోమవారం నామినేషన్స్ ప్రక్రియకు ముందు ఓ అనుమానం వ్యక్తం చేస్తుంది.
మూడు వారాల పాటు నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తాను ఈ వారం నేను ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందని నాకు అనిసిస్తుంది అని కీర్తి చెప్పుకొస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున నేరుగా ఇద్దరిని నామినేట్ చేశాడు. అందులో అర్జున్ కళ్యాన్ తో పాటు కీర్తి కూడా ఉంది. సో నిజంగానే ఈ వారం ఎలిమినేషన్ విషయంలో కీర్తి అనుమానం నిజం అవుతుందా అనేది చూడాలి మరి..!