టాలీవుడ్‍లో టాప్ హీరోయిన్‍లలో ఒకరిగా ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతోన్న ‘కాజల్ అగర్వాల్’ త్వరలో సినిమాలకు వీడ్కోలు పలకనుందనే వాదనలు ఊపందుకున్నాయి. కాజల్ చేసిన ట్వీట్‍తో వీటికి మరింత బలమొచ్చింది. సుమారు 16 సంవత్సరాల క్రితం లక్ష్మీ కల్యాణంతో టాలీవుడ్‍లో తెరంగేట్రం చేసింది కాజల్.
ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. టాప్ హీరోయిన్ స్థాయికి చేరింది. ఇప్పటికీ హీరోయిన్‍గా సినిమాలు చేస్తోంది. అయితే, ప్రస్తుతం తన చేతిలో ఉన్న రెండు చిత్రాలు అయిపోయాక సినీ రంగానికి కాజల్ వీడ్కోలు చెప్పనుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందుకు బలమైన కారణం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది.

కాజల్ :
2020లో వ్యాపారవేత్త గౌమ్ కిచ్లూను వివాహం చేసుకుంది కాజల్ అగర్వాల్. వీరికి నీల్ అనే కుమారుడు ఉన్నాడు. ఇటీవలే నీల్ తొలి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, సినిమాల వల్ల తన కుమారుడితో గడిపేందుకు సమయం దొరకడం లేదని కాజల్ అగర్వాల్ భావిస్తోందట. అందుకే ఇక సినిమాలకు గుడ్‍బై చెప్పి కుటుంబానికి పూర్తి సయయాన్ని కేటాయించాలని ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఈ తరుణంలో కాజల్ తాజాగా ఓ ట్వీట్ చేసింది.
“అంగీకరించిన పనులన్నీ అయిపోయిన సమయంలో.. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు!” అంటూ ఓ ట్వీట్ చేసింది కాజల్ అగర్వాల్. తాను రిలాక్స్‌గా కూర్చొని ఉన్న ఓ ఫొటోను దీంతో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్‍గా మారింది. దీంతో సినిమాల నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్టు కాజల్ ఈ ట్వీట్‍తో సంకేతాలు ఇచ్చారా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాలు మానేస్తున్నారా అంటూ చాలా మంది నెటిజన్లు కూడా ఈ ట్వీట్‍కు కామెంట్లు చేస్తున్నారు.