Biggboss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగులో తొలి నామినేషన్స్ ఘట్టం ముగిసింది. కాస్త వాడీవేడీగానే ఈ నామినేషన్స్ నడిచాయి. ఏదైనా కొత్తదనం చూపించాలనుకున్నాడో మరేంటో కానీ బిగ్‌బాస్ ఈసారి నామినేషన్స్‌ను ఏకంగా సోమవారం నుంచి బుధవారానికి మార్చేశాడు. కేవలం మూడు రోజుల్లో పడే ఓట్ల ఆధారంగానే ఎలిమినేషన్ ప్రాసెస్ జరగనుంది. మరి ఈ మూడు రోజుల్లో కంటెస్టెంట్లకు ఏమాత్రం ఓట్లు పడతాయో తెలీదు కానీ కచ్చితంగా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ లేడీ కంటెస్టెంటే ఎందుకు ఎలిమినేట్ అవుతుంది? ఎలిమినేషన్‌లో ఆసక్తికర విషయం ఏంటనే దానిపై ఓ లుక్కేద్దాం.
బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు ఇచ్చిన క్లాస్.. మాస్.. ట్రాష్ టాస్క్ నిన్నటితోనే ముగిసింది. ట్రాష్‌లో ఉన్న ఆదిత్య, ఇనయ, అభినయ శ్రీ నేరుగా నామినేట్ అయ్యారు. క్లాస్ టీమ్‌లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా ఈవారం నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. ఇక నామినేషన్ ప్రాసెస్ మొత్తం మాస్ టీమ్ సభ్యుల మధ్య మాత్రమే జరిగింది. అయితే ఇందులో బిగ్‌బాస్ ఒక ట్విస్ట్ కూడా పెట్టాడు. మెరీనా-రోహిత్ జంటగా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు కాబట్టి వారిలో ఎవరిని నామినేట్ చేసినా ఇద్దరూ అవుతారని.. ఓట్లు తక్కువగా పడి ఎలిమినేట్ అయినా కూడా ఇద్దరూ జంటగానే బయటకు వెళ్లిపోతారంటూ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.
Biggboss 6 : ఈ బంపర్ ఆఫర్ మెరీనా-రోహిత్ దంపతులకే ఎందుకో..
అయితే గతంలో వరుణ్ సందేశ్ – వితిక దంపతులు అడుగుపెట్టినా ఎవరి ఆట వారే ఆడుకున్నారు, ఎవరి నామినేషన్ వారే చేసుకున్నారు. బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు విడివిడిగానే వెళ్లిపోయారు. వారికి ఇలాంటి ట్విస్ట్ ఏమీ బిగ్‌బాస్ ఇవ్వలేదు. మరి ఈ బంపర్ ఆఫర్ మెరీనా-రోహిత్ దంపతులకే బిగ్‌బాస్ ఎందుకు ఇచ్చాడనేది తెలియడం లేదు. అయితే దీన్ని బట్టి మరో విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పక్కాగా కనిపిస్తోంది. ఎందుకంటే మెరీనా – రోహిత్ జంట ఒక్కసారే వెళ్లిపోయేలా బిగ్‌బాస్ ప్లాన్ చేశాడు కాబట్టి ఒకవేళ వారు మధ్యలోనే వెళ్లిపోతే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వేరొక కంటెస్టెంట్‌ను పక్కాగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.