Yarlagadda Lakshmi Prasad : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై వైసీపీకి మద్దుగా నిలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ స్పందించారు. ఇక ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి ఆలస్యంగా మీడియాకు వచ్చి జగన్ నిర్ణయంపై స్పందించారు. జగన్ నిర్ణయం సమర్థనీయమని ప్రశంసించారు. ఎన్టీఆర్ పేరు తీసేయంపై రచ్చ చేయాల్సిన అవసరం లేదని, అది సరైన నిర్ణయమని లక్ష్మిపార్వతి చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తీసేయడం వల్ల ఆయన గౌరవం ఏం తగ్గదన్నారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు కావాలా.. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కావాలా.. ఈ రెండింటిలో ఏది కావాలో చెప్పాలని లక్ష్మిపార్వతి ప్రశ్నించారు. కానీ తాను ఎన్టీఆర్ వీరాభిమానినని చెప్పుకునే కొడాలి నాని మాత్రం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. దీంతో కొడాలి నాని జగన్ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారని, అందుకే స్పందించలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక మరికొందరు మాత్రం వైసీపీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తుందని చెబుతున్నారు. గత వారం లక్ష్మిపార్వతి వచ్చారని, ఈ వారంలో కొడాలి నాని వస్తారని చెబుతుననారు.
Yarlagadda Lakshmi Prasad :
మరికొందరు మాత్రం లక్ష్మిపార్వతి ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి స్పందించారని, కొడాలి నానికి అంత ధైర్యం లేదని అభిప్రాయపడుతున్నారు. జగన్ నిర్ణయం వల్ల కొడాలి నానికి చిక్కులు వచ్చాయని, కార్యకర్తలకు, అభిమానులకు సమాధానం చెప్పుకోలేకపతున్నారిన అంటు్నారు. దీంతో అందుకే కొడాలి నాని సైలెంట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ప్రతి చిన్న అంశంపై మీడియాకకు ముందుకు వచ్చి కొడాలి నాని స్పందిస్త ఉంటారు. చంద్రబాబుపై ఒంటికాలిపై లేస్తూ ఉంటారు. అలాంటి కొడాలి నాని అసలు గత పది రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. నియోజకవర్గంలో కూడా పర్యటించడం లేదు. దీంతో కొడాలి నానాి వ్యవహారం ఇప్పుడ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాని స్పందిస్తారా లేదా అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.