Younger Womens Love: ప్రేమించుకోవడానికి పెద్ద కొలమానాలు ఏమీ అక్కర్లేదు. ఎవరు ఎవరితోనైనా, ఏ వయస్సు వారితోనైనా ప్రేమను పంచుకోవచ్చు. ప్రేమకు వయసు, కులం, గోత్రం, రంగు, ప్రాంతం లాంటివి ఏవి లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రేమించుకుంచుకునే అవకాశం కలదు. ఆడ, మగ ఎవరైనా సరే ఒకరు మరొక ప్రేమను పోందాలంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలి. ప్రేమ అనేది ఒక మధుమైన వెలకట్టలేని మధురానుభూతి. ప్రేమ విలువ ఆ ప్రేమను పొందివారికే తెలుస్తుంది.
యువత ఎక్కువగా ప్రేమలో మునిగితేలుతూ ఉంటారు. యువత ప్రేమ ఒక ఆకర్షణ అని కూడా చెబుతూ ఉంటారు. హార్మోన్స్ ప్రభావం కారణంగా యుక్త వయసులో ఉన్న వారు ప్రేమలో పడతారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఆకర్షణ కారణంగా ఏర్పడిన ప్రేమ కూడా పెళ్లి వరకు వచ్చి సుఖమైన దాంపత్య జీవితాన్ని గడిపిన జంటలు ఎన్నో ఉన్నాయి. అలాగే మనస్పర్థల కారణంగా విడిపోయిన జంటలు కూడా అనేకమే అని చెప్పవచ్చు.

Younger Womens Love: వయసు పైడిన వారినే ఎక్కువగా ఇష్టపడటానికి కారణం ఇదే..!
అయితే మహిళలు ఎక్కువగా వయసుపైబడిన వారినే ఇష్టపడతారట. అదేంటి అనుకుంటున్నారా…? అవును మహిళలు ఎక్కువగా వయసు పైబడిన వారినే ఇష్టపడేందుకు అనేక కారణాలు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనవి అనుభం కలిగి ఉండటం. ఎందులోనైనా సరే వారికి అనుభవం కలిగి ఉంది అనే బలమైన కారణమే మహిళలు వారిని ఇష్టపడతారు అనేందుకు నిదర్శంగా చెప్పవచ్చు. అనేక విషయాలలో అనుభవం రిత్యా వారి పట్ల మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతారట.
దీంతో పాటు వారికి వ్యక్తిత్వం పలు విధాలుగా ఆకర్షణీయంగా ఉంటుంది. జీవితాన్ని అర్ధం చేసుకోవడం, చేసే పనిలో నిబద్దత, వృత్తి పట్ల లక్ష్యన్ని కలిగి ఉంటడం, యుక్త వయసులో మాదిరిగా మోసం, కుట్ర, కోపం, ధ్వేషం, అనుమానం, మొండితనం లాంటివి ఉండకపోవడం కూడా మహిళల ఆకర్షణకు కారణాలట. అంతేకాకుండా వయసుపైబడిన వారు రొమాన్స్ పట్ల ఎక్కువగా అవగాహన ఉంటుంది. దీంతో స్త్రీలను లైంగిక సంబంధంలో శారీరకంగా సంతృప్తిపరుస్తారు. ఆర్థికంగా స్థిరపడి ఉంటారు. ఇలా అనేక కారణాల చేత మహిళలు ఎక్కువగా వయసు పైబడిన వారినే ఇష్టపడతారట.