White Teeth: మనిషికి అందాన్ని ఇచ్చేది చిరునవ్వు. అందుకే ఫోటో దిగేటప్పుడు నవ్వమని చెప్తుంటారు. కానీ నవ్వినప్పుడు కనిపించే పళ్లు తెల్లగా లేకపోతే అందవిహీనంగా కనిపిస్తారు. చాలా మంది పళ్లు సరిగ్గా తోముకోవడానికి బద్ధకిస్తుంటారు. దీంతో తెల్లగా కనిపించాల్సిన దంతాలు పసుపుపచ్చగా కనిపిస్తాయి. దీంతో చిన్న వయసులోనే దంత సమస్యలతో బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరికొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దంత సమస్యలు వేధిస్తాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే దంతాలు తెల్లగా ఉండటంతో పాటు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
అరటి పండు, బత్తాయి, కమలా పండ్లు, నిమ్మకాయ తొక్కలలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం దంతాలను తెలుపు రంగులోకి తీసుకువస్తుంది. అందువల్ల ప్రతిరోజూ బ్రష్ చేసే ముందు సిట్రిక్ ఆమ్లం లభించే పండు తొక్కలను దంతాలపై రుద్దాలి. అనంతరం బ్రష్ చేయాలి. ఇలా కొద్దిరోజులు చేస్తే దంతాలు తెల్లగా మారుతాయి.
ప్రతి ఇంట్లో తులసి ఆకులు అందుబాటులో ఉంటాయి. తులసి ఆకుల్నిఎండబెట్టి పొడి చేసి దీనితో ప్రతిరోజూ బ్రష్ చేస్తే పళ్లపై వచ్చే పసుపు మరకలు తొలగిపోతాయి. అంతేకాకుండా పళ్లకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా పోతాయి. అంతేకాకుండా లవంగాలను పొడిచేసి దానితో పళ్లు రుద్దుకుంటే దంతాలు తళతళా మెరిసిపోతాయి. ఉప్పులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి ఈ మిశ్రమంతో పళ్లపై రద్దుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది.
White Teeth: కొబ్బరినూనెతో దంత సమస్యలకు చెక్
కొబ్బరి నూనెతో దంత సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. అందువల్ల టేబుల్ స్పూన్ మోతాదులో కొబ్బరి నూనె నోటిలో వేసుకుని పుక్కిలించాలి. ఇలా 10 నిమిషాలు చేసిన తరువాత ఆ నూనెను ఉమ్మివేయాలి. ఆ తరువాత కొన్ని మంచి నీళ్లు నోట్లో పోసుకుని పుక్కిలించాలి. అనంతరం బ్రష్ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అటు బేకింగ్ సోడాను కొంతనీటిలో కలిపి పేస్టులా తయారుచేసుకుని బ్రష్ చేసుకుంటే దంతాలు తెల్లగా మెరుస్తాయి.