Galla Jayadev : గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గత కొంతకాలంగా రాజకీయంగా అంత యాక్టీవ్ గా ఉండటం లేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా అంత చురుగ్గా పాల్గొనడం లేదు. అడపడపా చంద్రబాబు కార్యక్రమాల్లో తప్పితే.. జిల్లా పార్టీ కార్యక్రమాల్లో ఆయన జాడే కనిపించడం లేదు. దీంతో పార్టీని ఆయన పట్టించుకోవడం లేదని, అంటీముంటన్లుగానే ఉంటున్నారనే చర్చ తెలుగు తమ్ముళ్లల్లో జరుగుతోంది. పార్టీని పూర్తిగా దూరం పెడుతున్నారని, కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదనే చర్చ జరుగుతోంది.
తాజాగా అమరావతి రైతులు ఉద్యమంలో గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కనిపిండచకపోవడం చర్చనీయాంశంగా మారింది. అమరావతి పరిధిలోని టీడీపీ ఎంపీ పాదయాత్రకు మద్దతు పలకకపోవడం, పాదయాత్రలో కనిపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ మళ్లీ ప్రవేశపెట్టే అవకాశముందన్న నేపథ్ంయలో అమరావతి రైతులు అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర చేపట్టారు. రాజధాని ప్రాంతం ఎక్కువగా గుంటూరు జిల్లాలోనే ఉంది. అలాంటి సిట్టింగ్ గుంటూరు ఎంపీ అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనకపోవం విశేషం.
Galla Jayadev :
గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలందరూ పాదయాత్రలో పాల్గొని రైతులకు మద్దతు ప్రకటించారు. కానీ గల్లా జయదేవ్ అసలు రైతుల పాదయాత్రపై స్పందించనే లేదు. మీడియా వేదికగా గాని, లేుదా మీడియా ప్రకటన ద్వారా గానీ ఆయన స్పందించిన దాఖారాలు లేవు. దీంతో కావాలనే ఆయన స్పందించడం లేదని, వైసీపీకి అనుకూలంగా వ్యహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారని, వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారని, ఇంతకుముందు ఉన్నట్లు ఇఫ్పుడు సంబంధాలు లేవనే చర్చ తెలుగు తమ్ముళ్లల్లో జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికలోపు ఆయన వైసీపీలో చేరుతారని, టీడపీలో అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ టీడీపీ నేతలు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. ఆయన టీడీపీని వదిలే ప్రసక్తే ఉండదని చెబుతున్నారు.