Biggboss 6 : సామాన్యులకు బిగ్‌బాస్‌లో అవకాశం కల్పిస్తాం అంటూ ఆ మధ్య నిర్వాహకులు ఒక ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో విడుదల చేయడంతో చాలా మంది ఆసక్తి చూపిస్తూ.. అప్లై చేశారు. ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. కుప్పలు తెప్పలుగా అప్లికేషన్లు, వీడియోలు వచ్చాయి. మరి ఏమైందో ఏమో కానీ సామాన్యుడు కాన్సెప్ట్‌కి స్వస్తి చెప్పారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో 21 మంది కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపారు. వారిలో ఒక్కరు కూడా సామాన్యుడు లేడు. కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చాలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డిలను హౌస్‌లోకి పంపించారు.
మే 26న హోస్ట్ నాగార్జున అధికారికంగా ఇచ్చిన ప్రకటన ప్రకారం.. ‘‘బిగ్‌బాస్ 6లో పాల్గొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు బంపరాఫర్.. ‘బిగ్‌బాస్ సీజన్-6లో సామాన్యులకు ఆహ్వానం.. ఇన్నాళ్లూ మీరు బిగ్‌బాస్ షోను చూశారు.. ఆనందించారు.. మీరు ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నారు కదూ.. అందుకే స్టార్ మా ఇస్తుంది.. ఆకాశాన్ని అందుకునే అవకాశం. వన్ టైమ్ గోల్డోన్ ఆఫర్. టికెట్ టూ బిగ్‌బాస్ సీజన్ 6′.. ఇప్పుడే starmaa.startv.com లింక్ క్లిక్ చేసి మీ వివరాలతో పాటు.. మీ టాలెంట్‌కు సంబంధించి 3 నిమిషాలు నిడివితో వీడియోను తీసి అప్‌లోడ్ చేయాలి.. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చేయండి’’అంటూ స్వయంగా నాగ్ మాట్లాడిన మాటల తాలూకు ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.
Biggboss 6 : బిగ్‌బాస్ చూసే ప్రతి ఒక్కరికీ ఆదిరెడ్డి తెలుసు..
ఈ ప్రోమో చూసి చాలా మంది సామాన్యులు బిగ్‌బాస్‌లో అవకాశం సంపాదించాలని ఆరాట పడ్డారు. వెంటనే అప్లై చేసి ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. వేలాదిగా అప్లికేషన్లు, వీడియోలు పంపించారు. అయితే ఆదివారం నాటి ఎపిసోడ్‌లో 21 మంది కంటెస్టెంట్స్‌లో యూట్యూబర్ ఆదిరెడ్డిని కామనర్ అని నాగ్ పేర్కొన్నారు. అదే నోటితో అతను పెద్ద యూట్యూబర్ అని.. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని.. బిగ్ బాస్ రివ్యూలతో పాపులర్ అయ్యారని కూడా స్పెషల్ వీడియో వేసి మరీ చూపించారు. నిజమే బిగ్‌బాస్ చూసే ప్రతి ఒక్కరికీ ఆదిరెడ్డి తెలుసు. అతను తన వీడియోస్‌తో చాలా పాపులర్ అయ్యాడు. అలాంటి ఆదిరెడ్డిని సామాన్యుడిగా పేర్కొనడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పైగా నాగ్ చెప్పిన వీడియోను సైతం యూట్యూబ్ నుంచి డిలీట్ చేయడంతో కావాలనే సామాన్యుడ్ని చీట్ చేశారని స్పష్టమవుతోందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.