యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు ,రెబా మోనికా జాన్ లు జంటగా నటించిన చిత్రం “సామజవరగమన” . రీసెంట్ రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ టాక్ తో భారీగా వసూళ్ల రాబట్టుతూ ముందుకు సాగుతుంది . ఈ సినిమాకి 7 కోట్ల పెట్టుబడి పెట్టగా , 4 వంతులు ఆదాయం సంపాదించి పెట్టింది. కీలక పాత్ర లో వీకే నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు.

ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో కలిసి చూసే క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది . సక్సెస్ టాక్ దక్కించుకున్న ‘సామజవరగమన’ ఓటీటీలోకి రావడానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయిందని తెలుస్తుంది . ఈ సినిమాకి నెట్‌ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ రైట్స్ దక్కించుకుంది.రెండో వారంలోనూ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా శ్రీ విష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమాకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్ ట్వీట్ చేసారు . ఈ విషయం అందరికి తెలిసిందే . అల్లు అర్జున్ అంటే శ్రీ విష్ణు ఎంత ఇష్టమో తెలియజేసారు .ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా అనిల్ సుంకర సమర్పణ లో హిలేరియస్ ఎంటర్‌టైనర్. ‘సామజవరగమన’.ను దండు రాజేష్ నిర్మించారు .‘సామజవరగమన’ ఈ నెల 22 న లేదా 25 న ఓటిటి లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం .