BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ అందరూ ఊహించినంత స్థాయిలో కొనసాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ సెలక్షన్ తప్పదం జరిగిందనేది మొదటి విమర్శగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఓ మాదిరిగానే హౌస్ కొనసాగుతోంది. ముఖ్యంగా హౌస్ లో శ్రీహాన్, ఇనయల యవ్వారం ఇప్పడు పెద్ద రచ్చగా మారింది.
శ్రీహాన్ గురించి అందరికీ తెలిసిందే..! నావీలో ఉద్యోగం వదిలేసి మరీ నటన మీద ఉన్న ప్యాషన్ తో షార్ట్ ఫిలిమ్స్ తీసి పెద్ద యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈటీవి ప్లస్ ఛానల్ తో కలిసి పలు ప్రాజెక్టుల కూడా చేశాడు శ్రీహాన్. ఇక ఇనయ మోడల్, యాక్టర్ గా అందరికీ పరిచయమే. తాజాగా బుజ్జీ ఇలా రా సినిమాలో కీలక రోల్ లో నటించింది. సో ఇలా వీరిద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..!
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ సందర్భంగా వారిద్దరి మధ్య తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. ఇద్దరి మధ్య వయసుతో పాటు ఎలుకల డిస్కర్షన్ కూడా వచ్చింది. మఖ్యంగా కెప్టెన్సీ పోటీదారుడి ఎంపిక జరుగుతున్న క్రమంలో పిట్టతో స్టార్ట్ అయిన శ్రీహాన్-ఇనయా గొడవ ముదిరి పెద్దరిగా మారింది. ఇప్పట్లో వారి మధ్య మాటల యుద్దం చల్లారేలా కనిపించడం లేదనే చెప్పవచ్చు. ఇద్దరి మద్య ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున సఖ్యత కుదుర్చుదామని చూసినా.. వీకెండ్ నాగ్ దగ్గర అంతా సెట్ అయ్యింది అన్నట్టుగానే ఉంటున్నారు ఇద్దరూ… కానీ మళ్లీ సందర్భం వచ్చినప్పుడల్లా గొడవ స్టార్ట్ అవుతోంది.
ఈ వారం జరిగిన నామినేషన్స్ లో ఇనయాతోనే ఎక్కువ మంది నామినేట్ చేయడం గమనార్హం. ముఖ్యంగా శ్రీహాన్ -ఇనయా మధ్య గట్టిగానే డిస్కర్షన్స్ జరిగాయి. ఇద్దరిలో ఎవరికి వారు తనది తప్పు లేదని నిరూపించుకునే క్రమంలో పెద్ద వాగ్వాదమే చోటు చేసుకుంది. నామినేషన్స్ వరకు సాగిన ఈ మాటల యుద్దం ఇంతటితో ముగుస్తుందా… ఈ వారంలో ఇంకా ఎక్కడైనా మరలా తెరపైకి వస్తుందా చూడాలి మరి..!