Overweight మారిన మన ఆహారపు అలవాట్ల వల్ల మనం ఎన్నో అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాం. వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య అధిక బరువు. అధికబరువు పెద్ద సమస్యలకు కూడా కారణం అని నిపుణులు అంటున్నారు. ప్రజలని హెచ్చరిస్తూ కొన్ని జాగ్రత్తలు కూడా చెపుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. తిండి మాత్రమే కాదు,జన్యుపరమైన సమస్యలు,అధిక స్ట్రెస్ కూడా అధిక బరువుకి కారణం కావచ్చని అంటున్నారు నిపుణులు.
మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తింటే బాడీలో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీకి సరిపడా వ్యాయామం లేకపోతే అది కొవ్వుగా,తరువాత అధిక బరువుగా మారే అవకాశం ఉంది. అధిక బరువు వల్ల కేన్సర్ (Cancer),హార్ట్ ఎటాక్ (Heart Attack),బీపీ (BP),షుగర్ (Sugar) లాంటి ఎన్నో రోగాలు వచ్చే అవకాశం లేకపోలేదు.
మనలో చాలా మంది తీపి పదార్థాలు ఎక్కువగా లాగిస్తూ ఉంటారు. అవి ఆరోగ్యానికి మంచిది కాదనేది నిపుణుల మాట. మన బాడీ లోకి ప్రవేశించే కేలరీలకి అనుగుణంగా శ్రమ ఉంటే అది వేరే సంగతి. పదార్థాలు తింటాం కానీ,కష్టపడం అంటే కుదరదు.చాక్లెట్లు,ఐస్‌క్రీములు,నూనెతో చేసిన పదార్థాలు,కూల్ డ్రింక్స్ లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని కరిగించలేకపోతే కొవ్వుగా రూపాంతరం చెందుతాయి. ఒకటి వాటిని మానెయ్యాలి. ఇంకొక మార్గం ఏంటంటే పండ్లు,డ్రైఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఆరోగ్యం మెరుగుపడటమే కాదు,వంట్లో పేరుకుపోయిన కేలరీలు కూడా తగ్గుతాయి వీటి ద్వారా.
Overweight
ఏది అధిక బరువు అనేది పెద్ద సమస్య ఇక్కడ. పెద్దగా శ్రమ లేకుండా మన అధిక బరువు గురించి తెలుసుకోవాలంటే ఒక లిమిట్ పెట్టుకుని నడవాలి. నడక తరువాత మరీ ఆయాసంగా ఉంటే మీరు అధిక బరువు ఉన్నట్టు లెక్క. దీనికి పరిష్కారం శారీరక శ్రమ పెట్టుకోవడమే. వాకింగ్,రన్నింగ్,లేదా సైకిల్ తొక్కడం కూడా మంచి ఫలితాలు ఇస్తాయి.