don’t eat meal : చాలామంది కోపం వచ్చినప్పుడు అన్నం తినడం మానేయడం, లేదంటే నీళ్లు తాగడం మానేయడం, ఇంకొందరు శరీరాన్ని గాయపరచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మనం చెప్పిన మాట శరీరం వినదు. శరీరం చెప్పిన మాటే మనం వినాలి. అందుకే మన శరీరం మెదడు చెప్పిన విధంగా ఆకలేసినప్పుడు తినాలి,దాహం వేసినప్పుడు తాగాలి. ఇలా ప్రతిరోజు మనం చేసే పనులు ఇవే. అయితే మనం ఒక్క పూట భోజనం చేయకుండా ఉంటే మన శరీరంలో ఎటువంటి మార్పులు కలుగుతాయో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం భోజనం చేయడం మానేయగానే శరీరంలోని షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
దానివల్ల మీరు సరిగా ఆలోచించలేరు. మెదడుకి అందాల్సిన గ్లూకోజ్ కూడా అందక మెదడు కూడా సరిగ్గా పనిచేయదు. మనం అన్నం తినకుండా ఉండటాన్ని మన శరీరం ఇష్టపడదు. మనం తినకుండా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ పడిపోయి చిరాకు,అలసట,అయోమయం వస్తాయి. స్ట్రెస్ హార్మోన్ అయినా కార్టిసోల్ ఉత్పత్తి అయ్యి మీపై ఒత్తిడి పెంచి ఆకలిని పెంపుతుంది. మీ బాడీలో మెటపాలిజమ్స్ లో అవుతుంది. అలాగే మన శరీరంలో ఉన్న చెడు కొవ్వు,వ్యర్థాలు బయటికి పోవాలి అంతే మెటాబాలిజం సరిగా జరగాలి.
don’t eat meal :
ఒకవేళ అది నెమ్మదిస్తే మీరు తగ్గాల్సిన బరువు తగ్గరు. అధిక బరువు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. లంచ్ మానేసిన తర్వాత మీరు రోజు కంటే ఎక్కువగా తింటారు అని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే భోజనం తినడం మానేసిన తర్వాత మన శరీరం, కణాలు ఆహారాన్ని అతిగా కోరుకుంటాయి. తినాలి అన్న ఆలోచన మరింత పెరుగుతుంది.