Biggboss 6 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండవ వారం కూడా పూర్తవబోతోంది. హౌస్‌లో తొలి ఎలిమినేషన్ రేపు జరగబోతోంది. ఆ బయటికెళ్లే కంటెస్టెంట్‌పై బయట ఊహాగానాలు బాగానే సాగుతున్నాయి. హౌస్ నుంచి బయటకు వెళ్లే మొదటి సభ్యుడు ఎవరా? అని అంతా ఎదురు చూస్తున్నారు. నామినేషన్, ఎలిమినేషన్, కెప్టెన్సీ లాంటి విషయాల కంటే హౌస్‌లో సభ్యులు, ప్రేక్షకుల్లో సైతం కొన్ని విషయాలు ఇంట్రస్టింగ్‌గా మారుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది.. రేవంత్- శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్ ఇష్యూనే. గత వారం ఒకసారి రేవంత్ వచ్చి అర్జున్ కల్యాణ్‌కు శ్రీ సత్య- వాసంతి చెల్లెళ్లు అని చెప్తాడు. అప్పుడు అర్జున్ కల్యాణ్ మొదట కాదని వారించి ఆ తర్వాత కేవలం వాసంతి మాత్రమే తనకు సిస్టర్ గా అంగీకరిస్తాడు.
శ్రీ సత్యను మాత్రం చెల్లి అని పిలవను అని అర్జున్ కుండ బద్దలు కొట్టేశాడు. అయినా రేవంత్ వినడే. ఆ తర్వాత ఇదే విషయంపై రేవంత్- అర్జున్ కల్యాణ్ మధ్య చాలానే వాదనలు జరిగాయి. ఇక సహించలేక పోయిన అర్జున్ ఈ వారం రేవంత్‌ని నామినేట్ చేశాడు. కామెడీ బౌండరీస్ దాటుతోందంటూ నామినేట్ చేసి పడేశాడు. ఆ తరువాత నుంచి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ తర్వాత రేవంత్ మళ్లీ ఆ టాపిక్ తీసుకొస్తే శ్రీ సత్య కూడా అర్జున్‌తో మాట్లాడింది. ఎందుకు అలా చేస్తున్నావ్ అని అడగింది. నేను జస్ట్ జోక్‌గా అలా అన్నాను. వాసంతిని సైతం జోక్‌గా చెల్లి అన్నాను అంటూ అర్జున్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
Biggboss 6 : కెమెరాలు ఉన్నాయని కూడా తెలియదా?
శ్రీ సత్య కూడా అర్జున్ అలాంటి వాడు కాదని రేవంత్‌కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆ వివాదాని ఫుల్ స్టాప్ పడలేదు. రెండోవారం స్టార్టింగ్‌లోనే ఒకసారి గొడవ జరిగితే శ్రీ సత్య.. ఇంట్లోని వాళ్లంతా తన అన్నలేనని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా అర్జున్ ఆమె చుట్టూ తిరుగుతుండటం చూసి ఇంట్లోని సభ్యులు సైతం గుసగుసలాడుతున్నారు. తాజాగా అంతా స్విమ్మింగ్ పూల్‌లో దిగి ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో అర్జున్- శ్రీ సత్య వైపే చూస్తున్నాడు అనే విషయాన్ని గమనించి అభినయ వెళ్లి శ్రీ సత్యను.. మీ మధ్య ఏమైనా ఉందా అని అడిగిందంట. ఇంకేముంది శ్రీ సత్య ఆ విషయాన్ని రేవంత్‌తో చెబుతూ కెమెరాలు ఉన్నాయని తెలియదా? ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వాళ్లిద్దరు నాలుగేళ్లుగా మంచి మిత్రులు అని శ్రీ సత్యనే చెప్పింది. వారి మధ్య అయితే తప్పుగా ఏమీ లేదని ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు.