Weight loss: అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు వివిధ రకాల టెక్నిక్స్ ట్రై చేస్తుంటారు. అయినప్పటికీ కొందరు బరువు తగ్గడం లేదని వాపోతుంటారు. ఊబకాయం వల్ల చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. మరి సులభంగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. త్వరగా బరువు తగ్గడానికి బెస్ట్ టెక్నిక్ అంటే స్మిమ్మింగ్ అని నిపుణులు చెబుతున్నారు.
ఈత కొట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. స్విమ్మింగ్ వల్ల శరీరం చురుగ్గా తయారవుతుంది. కార్డియో వ్యాయమంగా కూడా స్విమ్మింగ్ ను పిలుస్తారు. జిమ్ కు వెళ్లి పెద్ద పెద్ద బరువులు ఎత్తి కసరత్తులు చేయలేని వారు ఈత కొట్టవచ్చు. కీళ్ల నొప్పులు ఉన్న వారు కూడా స్విమ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
చేతులు, కాళ్లు, శరీరమంతా కదిలేలా చేస్తుంది..
ఈత కొడితే మన బాడీలోని మొత్తం అవయవాలన్నీ కదులుతాయి. చేతులు, కాళ్లు కదిలిస్తూ ఈత కొడతాం. దీని కారణంగా శరీరం మొత్తం పని చేయడం మొదలు పెడుతుంది. ఉదరం, చేతులు, కాళ్లు, తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి స్విమ్మింగ్ కు మించిన బెస్ట్ వ్యాయామం ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు.
Weight loss:
రోజూ ఓ అరగంట ఫ్రీ స్టైల్ లో స్విమ్మింగ్ చేయడం వల్ల దాదాపు 300 కేలరీలు ఖర్చవుతాయి. అదే బటర్ ఫ్లై మోడ్ లో ఈత కొడితే 400 వరకు కేలరీలు ఖర్చు అవుతాయి. స్విమ్మింగ్ లో కూడా వివిధ రకాల పద్ధతులున్నాయి. ఏ పద్ధతిలో చేసినా బాడీలోని కొవ్వును బాగా కరిగిస్తుంది. కేలరీల బర్న్ మనం ఉపయోగించే కండరాలపై ఆధారపడి ఉంటుంది.