Weight Loss : చాలా మంది వ్యక్తులను బాగా ఇబ్బంది పెడుతున్న అంశం బరువు పెరిగిపోవడం. మరీ ముఖ్యంగా స్త్రీలు పెళ్లి చేసుకొని పిల్లలకు జన్మనిచ్చాక భారీగా బరువు పెరగడం చూస్తుంటాం. దీని కారణంగా వారు బయటకు రావాలన్న ఏదైనా వేడుకకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. వీటన్నిటి తగ్గించి అందరిలా మీరు తిరగాలనుకోటున్నారా అయితే వీటిని ప్రయత్మించండి. అయితే ఒక్కసారిగా బరువు తగ్గడం కూడా అంత మంచిది కాదు. కాబట్టి నెమ్మదిగా బరువు తగ్గడానికి ఎలాంటి జీవనశైలిని అలవాటు చేసుకోవాలో ఇప్పుడు ఇక్కడ తెలుసుకోండి.
ఒక నెలలో ఎంత బరువు తగ్గవచ్చు?
మాములుగా ఒక వ్యక్తి సురక్షితంగా, ప్రభావవంతంగా తన బరువును వారానికి దాదాపుగా 1–2 పౌండ్లు కోల్పోతారు. ఆ సంఖ్యలను అలానే పాటిస్తే. ఒక నెలలో సురక్షితంగా 4–8 పౌండ్లు తగ్గగలుగుతారు. వారానికి 1 పౌండ్ శరీర కొవ్వును కోల్పోవడానికి, మీరు రోజూ తినే దానికంటే 3,500 ఎక్కువ కేలరీలు తక్కువ తినాలి. దాని కోసం రోజుకు 500 కేలరీలు శక్తిని తగ్గించాలి. 7,000 కేలరీలు 2 పౌండ్ల శరీర కొవ్వుకు సమానం కాబట్టి.. వారానికి రెండు పౌండ్లు లేదా ఒక నెలలో 8-10 పౌండ్ల బరువు తగ్గడానికి మీ శక్తిని రోజువారీగా 1,000 కేలరీలు తగ్గించేసేలా చూసుకోండి.
అల్పాహారం & ఆహారం
మీరు కొంత బరువు తగ్గించుకోవాలనుకుంటే.. ఉదయాన్నే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు, పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. శుద్ధి చేసిన పిండి పదార్థాలను బాగా తీసుకోవడం వల్ల అధిక బరువు, పొట్ట కొవ్వు ఎక్కువ కావడానికి కారణమవుతుంది. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో స్పైక్‌లు, క్రాష్‌లకు కారణమవుతాయని, కాబట్టి ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం వల్ల మనం అనుకొన్న లక్ష్యమైన బరువు తగ్గడంను తొందరగా చేరుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
Weight Loss : శారీరక కార్యకలాపాలు
రోజంతా తగిన వ్యాయామం చేయడం, కదలడం వల్ల మీ బరువు తగ్గడం సులువు అవుతుంది. నాన్-ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్ (NEAT) మీరు రోజువారీగా బర్న్ చేసే పూర్తి కేలరీలలో 50% వరకు ఉంటుంది. కాబట్టి రోజు సమయానికి ఆహారం తీసుకోవడం అలాగే 8 గంటలు నిద్రపోవడం కూడా బరువు తగ్గడంకు చాలా ముఖ్యమే.