Weight Loss Drinks: మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఆహార అలవాట్లు, అధికంగా నిద్రపోవడం, సరైన డైట్ లేకపోవడం లాంటి కారణాలతో అధిక బరువు పెరుగుతుంటారు. అయితే, వెయిట్ పెరిగినంత ఈజీగా తగ్గడం సాధ్యం కాదు. దురలవాట్లు కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి. వెయిట్ తగ్గించుకోవాలంటే కఠినమైన వ్యాయామాలు చేయనవసరం లేకుండానే కొన్ని మార్గాలు ఉన్నాయి.
చెడు అలవాట్ల కారణంగా శరీరం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంటుంది. అధిక బరువు పెరగడానికి ఇది దోహదం చేస్తుంది. దీంతో శరీర ఆకృతి అంద విహీనంగా తయారవుతుంది. చాలా మంది పెరిగిన కొవ్వును, అధిక బరువును తగ్గించుకోవడానికి అనేక తంటాలు పడుతుంటారు. ఉదయం, సాయంత్రం పరుగులు తీయడం, జిమ్ లో కసరత్తులు చేయడం లాంటివి చేస్తుంటారు.
అయితే, అందరికీ జిమ్ లో విన్యాసాలు చేయడం, రన్నింగ్ లాంటివి సాధ్యం కావు. పట్టణాల్లో ఉండే వారికి కుదరదు. అలాంటప్పుడు కొన్ని ఈజీ టిప్స్ పాటిస్తే సులభంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని పానీయాలు తీసుకోవాలి. ఇలాంటి వాటిలో గ్రీన్ టీ ముఖ్యమైనది. పాలు, చక్కెర, టీకి మంచి ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ నిలుస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ పుచ్చుకుంటే అధిక బరువు తగ్గవచ్చు.
Weight Loss Drinks: నిమ్మరసంతో అధిక బరువు దూరం..
నిమ్మరసం కూడా బరువును తగ్గిస్తుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ పిండి తాగితే కొన్ని వారాల్లోనే బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే వాము వాటర్ కూడా బరువు తగ్గడానికి బెస్ట్ ఔషధం. చాలా మంది ఇళ్లలో వాము వాటర్ స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు. ఓ గ్లాసు నీటిలో వాము వేసి రాత్రి నానబెట్టి ఉదయం తీసుకుంటే మంచిది. సోంపూ కూడా బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోసిస్తుంది. భోజనం తర్వాత కాస్త నోట్లో వేసుకొని నములుతూ ఉంటే కొన్ని రోజుల్లోనే బరువు తగ్గుతారు.