మంగళవారం రోజు పుట్టడం మాకు అదృష్టమేనని ఉపాసన-చరణ్ బిడ్డపై చిరంజీవి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులు బిడ్డకు జన్మనివ్వడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం అంటూ ట్విట్ చేశారు. నీ రాకతో మెగా ఫ్యామిలీకి ఉత్సాహం తీసుకొచ్చావని పేర్కొన్నారు.

తల్లి దండ్రులుగా రామ్ చరణ్-ఉపాసన, తాతగా తనకు సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపారు. ఉదయం 1:49 కి పాప పుట్టింది..మాకెంతో ఇష్టమైన మంగళవారం నాడు పాప పుట్టడం ఆనందకరం అని చిరంజీవి పేర్కొన్నారు. మంచి ఘడియల్లో పుట్టిందని , పాప జాతకం కూడా అధ్బుతంగా ఉందంటున్నారు..ఆ ప్రభావం ముందు నుంచి మా కుటుంబంలో కనబడుతుందన్నారు. రామ్ చరణ్ కెరీర్ లో ఎదుగుదల, వరుణ్ ఎంగేజ్ మెంట్ ఇలా మా ఫ్యామిలీ లో అన్నీ శూభాలే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.