Drushyam: సినిమాలు సమాజంపై చాలా ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలో సినిమాలో ఏమాత్రం వల్గారిటీ ఉన్న.. హద్దులు దాటుతున్న సెన్సార్ బోర్డు కలుగజేసుకుంటుంది. సదరు సీన్స్ ఇంకా డైలాగులను తీసేసే రీతిలో వ్యవహరిస్తుంటది. ఇంకా మరి సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఉంటే న్యాయస్థానాలు కలుగజేసుకుంటాయి. సినిమాలు కొన్ని సమాజాన్ని చైతన్య పరిచే విధంగా ఉంటాయి. మరి కొన్ని సినిమాలు సమాజాన్ని అనేక ఇబ్బందులకు గురి చేసే రీతిలో ఉంటాయి. సినిమా ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో అదే రీతిలో కొన్ని భయంకరమైన పనులకు కూడా పురుకొల్పుతోందని.. తాజా సంఘటన రుజువు చేసింది. విషయంలోకి వెళ్తే “దృశ్యం” సినిమా అందరికీ తెలుసు. ఈ సినిమా చూసి సొంత భర్తని భార్య.. కూతురితో పన్నాగం పన్ని హత్య చేయించింది. పూర్తి విషయాల్లోకి వెళితే కర్ణాటక బెలగావిలో సుధీర్ కాంబళె (57) ఏప్పటినుండో ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా రాణిస్తూ ఉన్నాడు. ఇతనికి భార్య ఒక కుమార్తె ఉన్నారు. భార్య పేరు రోహిణి, కుమార్తె పేరు స్నేహ.
ఇదిలా ఉంటే కూతురు స్నేహ పూణేలో చదువుతున్న సమయంలో అక్షయ విఠాకర్ అనే వ్యక్తితో ప్రేమలో పడటం జరిగింది. అయితే ఈ విషయం సుదీర్ కి తెలియడంతో.. కూతురు స్నేహాన్ని మందలిస్తాడు. ఈ పరిస్థితుల్లో తల్లి రోహిణి కూతురికి సపోర్ట్ చేయడం జరుగుతోంది. దీంతో తండ్రిపై కోపాన్ని పెంచుకున్న స్నేహ తల్లి రోహిణితో కలిసి తండ్రిని కడతేర్చాలని నిర్ణయించుకుని ప్లాన్ వేయడం జరుగుద్ది. ఈ క్రమంలో పూణేలో ఉన్న ప్రియుడు అక్షయ్ ను పుణె నుంచి బెళగావికి సెప్టెంబరు 15న రప్పించి ఓ లాడ్జిలో ఉంచింది. సుధీర్ తన ఇంటిలోని పై అంతస్తులో నిద్రపోతుండగా సెప్టెంబరు 17 తెల్లవారుజామున.. తల్లి కూతురు… అక్షయ్ నీ పిలిపించడం జరుగుద్ది. ఆ తర్వాత సుధీర్ నిద్రపోతుండగా కాళ్లు చేతులు తల్లి కూతురు గట్టిగా పట్టుకోవడంతో. అక్షయ్ కత్తితో విచక్షణ రహితంగా పొట్టలో మొహంపై గట్టిగా పోడవటం జరుగుద్ది. దీంతో సుధీర్ మరణించాడని మొత్తం ధ్రువీకరించుకున్నాక అప్పుడు అక్షయ్ వెంటనే అక్కడి నుండి పూణేకి వెళ్లిపోతాడు.
అయితే ఈ క్రమంలో చుట్టుపక్కల ప్రజలందరిని నమ్మించడానికి భార్య తన భర్త సుదీర్ ని ఎవరు హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఎటువంటి ప్రశ్న అడిగినా గాని తల్లి కూతురు ఒకేలా సమాధానం చెప్పడంతో అవాకయ్యారు. ఈ క్రమంలో వారి సెల్ ఫోన్ నెంబర్ లపై నిఘ పెట్టడం జరుగుద్ది. అయితే తరచూ కూతురు స్నేహా నుండి ఎక్కువగా పూణేకి ఫోన్ వెళ్లడంతో.. పోలీసులు తమదైన శైలిలో స్నేహాను విచారించడంతో మొత్తం విషయం బయట పెట్టింది. తన ప్రేమకు అడ్డొస్తున్నాడన్నే కారణంగా .. తల్లి, ప్రియుడుతో కలిసి తండ్రి సుధీర్ నీ హత్య చేసినట్లు ఒప్పుకుంది. అంతేకాదు ఈ హత్య చేయకముందు దృశ్యం సినిమా పదిసార్లు చూసినట్లు పోలీసుల విచారణలో స్నేహ తెలిపింది. దీంతో తల్లి రోహిణి ఇంకా ప్రియుడు అక్షయ్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు.