శివకార్తికేయన్ నటించిన ‘మావీరన్‘ విజయవంతంగా థియేట్రికల్ రన్‌లో ఉంది మరియు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 75 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.. అయితే ఈ సినిమా కథ 2006 హాలీవుడ్ సినిమాని పోల్చి ఉండటంతో దర్శకుడు మడోన్ అశ్విన్ కి ఎదురుదెబ్బ తగిలింది.

‘శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన మావీరన్ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది, రెండో వారంలో థియేట్రికల్ రన్‌లో మంచి ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన, శివకార్తికేయన్ సూపర్ హీరో చిత్రంలో అసాధారణమైన నటనను ప్రదర్శించాడు మరియు ఈ చిత్రం కథ మరియు స్క్రీన్ ప్లే కూడా అభిమానులను ఆకట్టుకుంది. అయితే శివకార్తికేయన్ ‘మావీరన్’ కథ 2006లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘స్ట్రేంజర్ దేన్ ఫిక్షన్’ తరహాలోనే ఉందని సోషల్ మీడియాలో తాజా కథనం అని చెప్పుకొచ్చారు .