Warner Tweet: అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో వరల్డ్ వైడ్ ట్రెండ్ సెట్ చేశాడు అల్లు అర్జున్. అందుకే ప్రపంచ వ్యప్తంగా క్రికెట్లతో పాటు, ఫుడ్ బాల్, అనేక రంగాల్లోని ప్రముఖులు పుష్ప స్టైల్ ను అనుకరించారు. క్రికెట్ లో అయితే దాదాపు అన్ని దేశాల క్రీడాకారులు తగ్గేదే ల్యా.. అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్, గడ్డం కింద చేతి వేళ్లను అనుకుంటూ హల్ చల్ చేశారు. టీమిండియాలోనూ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాతో సహా అనేక మంది అల్లు అర్జున్ హావభావాలను అనుకరించారు.
ఇక సన్ రైజర్స్ జట్టు మాజీ ఆటగాడు, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ది ప్రత్యేక శైలి. తెలుగు వారంటే అమితంగా ఇష్టపడే వార్నర్.. ఇన్ స్టా గ్రామ్ లో తరచూ తెలుగు పాటలకు డ్యాన్స్ లు, డైలాగులు చెబుతూ ఆకట్టుకుంటుంటాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో చాలా డైలాగులు తెలుగులో చెప్పేశాడు వార్నర్. అయితే, రీసెంట్ గా పుష్ప సినిమాకు అవార్డుల పంట పండింది. ఫిల్మ్ ఫేర్ పురస్కారాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు పుష్ప టీమ్ అదరగొట్టింది. పుష్ప చిత్రానికి ఏకంగా ఏడు పురస్కారాలు దక్కాయి.
దీనిపై స్పందించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. ఫిల్మ్ ఫేర్ అవార్డులకు అల్లు అర్జున్ పుష్ప చిత్రం ఎంపిక కావడం సంతోషాన్ని కలిగిస్తోందన్నాడు వార్నర్. సినిమాలో నటించిన అందరికీ అభినందనలు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు వార్నర్ భాయ్.
Warner Tweet:
శుభాకాంక్షలు చెప్పడంతోపాటు పుష్ప గెటప్ లో ఉన్న తన ఫొటోను వార్నర్ జత చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. పుష్పరాజ్ గెటప్ లో వార్నర్ ఒదిగిపోయాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వార్నర్ ఆహార్యం అచ్చం అల్లు అర్జున్ లాగే ఉందని చెబుతున్నారు.