Viral: ప్రస్తుత కాలంలో యువత టెక్నాలజిని విరివిగా వాడుకుంటుంది. పూర్వకాలంలో పెళ్లి చేసేందుకు పెద్దలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసేవారు కానీ ఇపుడు అలాంటి ఊసే లేదు. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లను వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. అంతా మ్యాట్రిమోనియాల్ ట్రెండ్ అయిపోయింది. మనం కేవలం డబ్బులు కట్టి వివరాలు రిజిస్ట్ చేయించుకుంటే చాలు.. వాళ్లే తగిన వధవు, వరుడిని వెతికిపెడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల మ్యాట్రిమోనియాల్ సైట్లలోని వివాహ ప్రకటనలు కొంచెం హద్దు దాటుతున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని హాస్యాన్ని తెప్పిస్తున్నాయి. అయితే అదే కోవకు చెందిన ఓ యాడ్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ నేపథ్యంలోనే హిందూ పిళ్ళై కుటుంబానికి చెందిన ఓ అందమైన, ధనవంతురాలైన యువతి మ్యాట్రిమోనియల్ సైట్‌లో తనకు కావల్సిన వరుడు ఎలా ఉండాలనే వివరాలను రాసుకొచ్చింది. అందులో తమ కులానికే చెందిన వ్యక్తే వరుడుగా కావాలని తెలిపింది. అంతేకాకుండా ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, బిజినెస్‌మాన్.. ఇలా ఎవ్వరైనా పర్లేదు అని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే చివర్లో నోట్ మాదిరిగా ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మాత్రం అస్సలు ఫోన్ చేయొద్దు’ అని స్పష్టంగా వెల్లడించింది.
ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కాగా, ఈ యాడ్‌ను సమీర్ అరోరా అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాడ్ చూసి ఓరి దేవుడో.. ఇలా అయితే ఎలా? అంటూ నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు.