మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతూ ఉండటంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని కూడా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
శృతి హాసన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాబీ సింహా విలన్ గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. ఆ సమయంలో వాల్తేర్ వీరయ్యతో పాటు ఆదిపురుష్, విజయ్ వారసుడు సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ నేపధ్యంలో చిరంజీవి సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అయితే ఇప్పుడు వాల్తేర్ వీరయ్య సినిమా నుంచి దీపావళికి ఒక క్రేజీ అప్డేట్ రాబోతుంది అని తెలుస్తుంది.
ఈ సినిమాకి సంబందించిన టైటిల్ పోస్టర్ తో పాటు, ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా ఫ్యాన్స్ కి ట్రీట్ గా అందించాలని బాబీ అనుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఫ్యాన్స్ ఎలాంటి అంశాలు కోరుకుంటారో అవన్నీ వాల్తేర్ వీరయ్య సినిమాలో ఉంటాయని తెలుస్తుంది. ఇక దీపావళికి మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ నుంచి కూడా టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. కీర్తి సురేష్ ఈ మూవీలో చిరంజీవి చెల్లిగా నటిస్తుంది. ఇక తమన్నా హీరోయిన్ గా నటించింది.