మెగాస్టార్ చిరంజీవి అంటే మాస్ ఎంటర్టైనర్. మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన మెగాస్టార్ సినిమాలతోనే ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా నిలబడ్డాడు. అయితే చాలా కాలంగా మెగాస్టార్ నుంచి సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ పడలేదు అని చెప్పాలి. తనని తాను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసుకునే ప్రయత్నంలో తన నుంచి ఫ్యాన్స్ కోరుకునే మాస్ క్యారెక్టరైజేషన్స్ ని పూర్తిగా పక్కన పెట్టారు. అయితే చాలా కాలం తర్వాత వాల్తేర్ వీరయ్య సినిమాతో మరోసారి మెగాస్టార్ తనలోని మాస్ హీరోని బయటకి తీసుకొచ్చారు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ నడుస్తుందని టైటిల్ బట్టి అర్ధమవుతుంది.
ఇక దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ ఈ మూవీకి సంబందించిన టైటిల్ ఎనౌన్సమెంట్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా ప్రేక్షకులకి అందించారు. మెగాస్టార్ నుంచి చాలా కాలంగా ఫ్యాన్స్ ఎలాంటి క్యారెక్టర్ కోరుకుంటున్నారో ఈ మూవీలో అదే తరహాలో పవర్ ఫుల్ మాస్ రోల్ ని చిరంజీవి పోషించారని లుక్ బట్టి అర్ధమవుతుంది. అలాగే చిరంజీవి అంటే వెంటనే గుర్తుకొచ్చేది కామెడీ ఎంటర్టైన్మెంట్. అతని ముఠా మేస్త్రి సినిమా చూస్తే ఓ వైపు మాస్ ఆడియన్స్ కి నచ్చే యాక్షన్ ఎలిమెంట్స్, అదే సమయంలో తనలోని కామెడీ యాంగిల్ లో తెరపై చూపించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఇప్పుడు మరోసారి 20 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్లి అలాంటి జోనర్ లో కంటెంట్ ని బాబీ వాల్తేర్ వీరయ్య సినిమా ద్వారా చూపించబోతున్నాడు అని టీజర్ బట్టి అర్ధమవుతుంది. వీరయ్య క్యారెక్టర్ ఎలివేషన్ కూడా పవర్ ఫుల్ గా ఉండే విధంగా దర్శకుడు బాబీ డిజైన్ చేశాడు. ఇక దీపావళి రోజు మాస్ ఆడియన్స్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ ట్రీట్ ని ఈ టీజర్ తో చిరంజీవి అందించాడు అని చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా వీరయ్య క్యారెక్టర్ ని మరింత ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఓవరాల్ గా అవుట్ అండ్ అవుట్ మాస్, కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుంది అని టీజర్ బట్టి అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ రోల్ కూడా కామెడీ టచ్ తోనే ఉండబోతుంది అని పోస్టర్ లుక్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఇక శృతి హాసన్ ఈ మూవీలో ఎలాంటి పాత్రలో కనిపించబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.