మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబందించిన ప్రమోషన్ వర్క్ లో చిరంజీవి ఉన్నారు. అనంతపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్ తో గాడ్ ఫాదర్ ప్రమోషన్ సందడి మొదలు కాబోతుంది. ఈ ప్రమోషన్ లో నయనతార, సత్యదేవ్ కూడా పాల్గొనే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఇప్పటికే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. అలాగే సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా జరిగిపోయింది. 200 కోట్ల వరకు గాడ్ ఫాదర్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. తెలుగు, మలయాళీ, హిందీ బాషలలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మలయాళం సంగతి ఎలా ఉన్న హిందీలో కూడా సినిమాపై మంచి హైప్ ఉంది.
దానికి కారణం సల్మాన్ ఖాన్ ఈ మూవీలో నటిస్తూ ఉండటమే. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ అవుతూ ఉండగా మరో వైపు మెగాస్టార్ 154వ చిత్రం వాల్తేర్ వీరయ్య షూటింగ్ శరవేగంగా నడుస్తుంది. మొన్నటి వరకు హైదరాబాద్ లో షెడ్యూల్ చేసిన బాబీ ఇప్పుడు మూవీ షూటింగ్ ని విశాఖకి మార్చాడు. ఈ సినిమా కథ పరంగా అంతా విశాఖ బ్యాక్ డ్రాప్ లోనే నడుస్తుంది. అయితే మెగాస్టార్ విశాఖలో షూటింగ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి చిరంజీవికి సంబందించిన సన్నివేశాలు అన్ని కూడా రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి కంప్లీట్ చేస్తున్నారు. మిగిలిన అవుట్ డోర్ షూట్ మొత్తం వైజాగ్ లో చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో చిరంజీవి లేని సన్నివేశాలని విశాఖలో దర్శకుడు బాబీ ప్లాన్ చేశాడు. నేటి నుంచి అక్కడ 154 షూటింగ్ జరగబోతుంది. షిప్ యార్డ్, పోర్ట్, బీచ్ రోడ్డులో కీలక సన్నివేశాలని షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, మరో కీలక పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. అలాగే బాబీ సింహా ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. అతనికి సంబందించిన సన్నివేశాలు అన్ని కూడా వైజాగ్ లో షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 45 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇక షూటింగ్ దశలో ఉండగానే ఈ మూవీ కోసం నెట్ ఫ్లిక్స్ అంత పెద్ద మొత్తం పెట్టడం మెగాస్టార్ స్టామినాని ప్రూవ్ చేస్తుందని చెప్పుకుంటున్నారు.