మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేర్ వీరయ్య. సంక్రాంతి రేసులో ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. రవితేజ కీలక పాత్రలో ఈ మూవీలో నటించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మాస్ కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపధ్యంలో సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వస్తుంది. మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా చిరంజీవి నుంచి అదిరిపోయే కమర్షియల్ సినిమా రావాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి నాలుగు సినిమాలు చేసిన అందులో ఆశించిన స్థాయిలో మాస్ జాతర అయితే లేదు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ కథ పరంగా చూసుకుంటే
జాలారి పేటలో ఉండే వీరయ్య అక్కడి జనానికి పెద్దన్నగా ఉంటాడు. అయితే అతనికి తెలియకుండా కొంత మంది డ్రగ్స్ స్మగ్లింగ్ నడుపుతారు. వాటిని అరికట్టడానికి పోలీస్ ఆఫీసర్ విక్రమ్ గా రవితేజ విశాఖకి వస్తాడు. వస్తూనే డ్రగ్స్ స్మగ్లింగ్ గ్యాంగ్ ని అరెస్ట్ చేస్తాడు. అదే సమయంలో వీరయ్యని కూడా జైల్లో పెడతాడు. అయితే వీరిద్దరూ ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ములు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్న అది చూపించుకోరు. అయితే విక్రమ్ ని డ్రగ్స్ స్మగ్లింగ్ గ్యాంగ్ హత్య చేస్తుంది. తరువాత బయటకి వచ్చిన వీరయ్య తన తమ్ముడిని చంపిన రౌడీల మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది కథాంశం.
రెగ్యులర్ కమర్షియల్ స్టొరీ లైన్ ని దర్శకుడు బాబీ తీసుకున్న దానికోసం అతను రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అవుతుంది. చాలా కాలం తర్వాత చిరంజీవిలో కామెడీ సెన్స్, మేనరిజమ్. పవర్ ఫుల్ మాస్ రోల్ కి ప్రేక్షకులు భాగా కనెక్ట్ అయ్యారు. అలాగే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కూడా సెకండ్ ఆఫ్ లో వన్ మెన్ షో చేసాడని చెప్పాలి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ఓ వైపు హై వోల్టేజ్ లో ఉంటూనే మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తాయి. ఇక ఈ సినిమాలో కథ, కథనానికి తగ్గట్లుగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో లెవల్ లో ఉంటుంది. ఇద్దరు స్టార్ హీరోలకి కలిపి స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు బాబీ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఓవరాల్ గా ఈ సినిమా సక్రాంతి బరిలో మెగా ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా మాస్ ఎంటర్టైనర్ సినిమాలు ఇష్టపడే వారికి పూనకాలు లోడింగ్ అని చెప్పాలి.