మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య నుంచి బాస్ పార్టీ పేరుతో టైటిల్ సాంగ్ ని నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ గా దీనిని రిలీజ్ చేయబోతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక శృతి హాసన్ ఈ మూవీలో హీరోయిన్ గా మెరుస్తుంది.
ఇక సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో మరోసారి ముఠా మేస్త్రీ తరహాలో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నాడు అని టీజర్ బట్టి బాబీ క్లారిటీ ఇచ్చేశాడు. అలాగే ఈ మూవీలో చిరంజీవి ఎంట్రీ సీన్ కూడా చాలా గ్రాండ్ గా తెరకెక్కించినట్లు తెలిపారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ గా బాస్ పార్టీ రాబోతుంది. ఇక ఈ సాంగ్ లో చిరంజీవికి జతగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా డాన్స్ చేసినట్లు దేవిశ్రీ ప్రసాద్ ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేశాడు.
ఫుల్ మాస్ బీట్ తో అదిరిపోయే రేంజ్ లో ఈ సాంగ్ ఉండబోతుందని స్పష్టం చేశాడు. ఊర్వశీ రౌతేలా తెలుగులో చేస్తున్న మొదటి ఐటెం సాంగ్ ఇదే కావడంతో దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ గ్రేస్ ముందు అనే డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది చూడటానికి ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సాంగ్ బట్టి తెలుగులో ఆమె ఫేట్ డిపెండ్ అయ్యి ఉంటుందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది.