బోయపాటి దర్శకత్వంలో బాలయ్య ముచ్చటగా మూడవసారి చేస్తున్న అఖండ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది.దీంతో చిత్ర యూనిట్ రేపు శిల్ప కళా వేదికగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుంది.ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అయిన బన్నీ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు.ఇతర హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చూరుక్కగా పాల్గొంటూ ఇండస్ట్రీలో అందరితో మంచి ర్యాపో మెయిన్ టైన్ చేసే బన్నీ ఇప్పుడు బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వస్తుండడంతో అసలు ఈ ఫంక్షన్ లో బన్నీ బాలయ్య గురించి ఏం మాట్లాడుతాడు దానికి బాలయ్య ఏం కౌంటర్ ఇస్తారో అని కళ్ళు, కెమెరాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఈమధ్యే ఆహా ద్వారా ఓటిటి ప్రేక్షకులకు దగ్గరైన బాలయ్య అల్లు అరవింద్ కుటుంబానికి బాగా దగ్గరయ్యారు.అందుకే ఆయన మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బన్నీ చీఫ్ గెస్ట్ గా పిలిచారని ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ ప్రచారం జరుగుతుంది.