VV Vinayak : పాన్ ఇండియా స్టార్స్‌గా ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడానికి ఎన్టీఆర్‌కు పెద్దగా సమయం పట్టలేదు. తొలి రెండు, మూడు సినిమాలతోనే మంచి స్టార్ డమ్‌ను సంపాదించుకున్నాడు. తారక్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ఆది అయితే.. కెరీర్ మరో టర్న్ తీసుకున్న చిత్రం మాత్రం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన యమదొంగ. ఈ చిత్రంలో తొలిసారిగా స్లిమ్‌గా కనిపించి మెస్మరైజ్ చేశాడు.
ఆది, సింహాద్రి సినిమాలు ఎన్టీఆర్ కెరీర్‌కు బ్యాక్‌బోన్‌గా నిలిచాయి. అయితే ఈ ఆది సినిమాకు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అంతా తానై వ్యవహరించారు. దీంతో వీరిద్దరికీ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అంతేకాదు.. అప్పట్లో కొడాలి నాని రాజకీయానికి తారక్ సైతం వెన్నుదన్నుగా నిలిచారనే టాక్ లేకపోలేదు. అసలు నానికి తొలిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిందే తారక్ అని టాక్. అప్పటి నుంచి వీరి మధ్య బంధం మరింత బలపడిందట. ఏ రాజకీయాల కారణంగా అయితే వీరి బంధం స్ట్రాంగ్ అయిందో అదే రాజకీయాల కారణంగా వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందట.
సీనియర్ డైరెక్టర్ వి.వి.వినాయక్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. తాను, కొడాలి నాని, వల్లభనేని వంశీ తరచూ కలుస్తూనే ఉంటామని చెప్పారు. అయితే తారక్‌కు మాత్రం వారిద్దరితో గ్యాప్ వచ్చిందని వెల్లడించారు. దీనికి కారణం పూర్తిగా అయితే తానెప్పుడూ అడగలేదు కానీ కొడాలి నాని వైసీపీలోకి వెళ్లేంత వరకూ మాత్రం ఆయనకు, తారక్‌కు మంచి అనుబంధం ఉండేదని చెప్పుకొచ్చారు. ఏవో కారణాల వల్ల వైసీపీలోకి వెళ్లాక నానికి, తారక్‌కు మధ్య గ్యాప్ పెరిగిందన్నారు.