కమర్షియల్ స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వివి వినాయక్. కెరియర్ లో చేసినవి తక్కువ సినిమాలే అయినా చాలా వరకు స్టార్ హీరోలతోనే వివి వినాయక్ సినిమాలు చేయడం విశేషం. తన మొదటి సినిమా ఆది నుంచి ఖైదీ నెంబర్ 150 వరకు స్టార్ హీరోలతోనే వివి వినాయక్ సినిమాలు తెరకెక్కాయి. అయితే కమర్షియల్ దర్శకుడుగా ఎంతగా గుర్తింపు తెచ్చుకున్నాడో కెరియర్ లో అంతే స్థాయిలో డిజాస్టర్ సినిమాలని కూడా వినాయక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో ఛత్రపతి మూవీ రీమేక్ కి వివి వినాయక్ దర్శకత్వం వహించారు.
భారీ బడ్జెట్ తోనే ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ లేదు. మూవీ కంప్లీట్ అయ్యిందో, ఆగిపోయిందో అనే విషయం కూడా తెలియదు. ఈ నేపధ్యంలో తాజాగా వివి వినాయక్ కి సంబందించిన ఒక వార్త బయటకొచ్చింది. త్వరలో వినాయక్ స్వీయ నిర్మాణంలో తన దర్శకత్వంలో తానే హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకి సంబంధించి కథ కూడా ఇప్పటికే సిద్ధం అయినట్లు తెలుస్తుంది. కరోనాకి ముందు దిల్ రాజు నిర్మాణంలో వివి వినాయక్ హీరోగా శీనయ్య అనే సినిమా తెరకెక్కింది.
అయితే ఈ సినిమా సగం షూటింగ్ కంప్లీట్ అయ్యాక అవుట్ ఫుట్ సరిగా రాలేదని, కంటెంట్ కూడా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా లేదని దిల్ రాజు ఆ మూవీని ఆపేసారు. దీంతో పూర్తి స్థాయిలో నటుడిగా కనిపించాలనే వివి వినాయక్ కోరిక అలాగే మిగిలిపోయింది. ఈ నేపధ్యంలో చాలా గ్యాప్ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో హీరోగా సినిమాని నిర్మించేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమా అఫీషియల్ గా ఎనౌన్స్ కావడంతో వెంటనే పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక తన సినిమా కోసం వినాయక్ స్లిమ్ అయ్యి లుక్ కూడా మార్చుకుంటున్నట్లు తెలుస్తుంది.